PM Modi congrats K Vishwanth for Dada Saheb Phalke award

Modi congratulate dada saheb vishwanth

PM Narendra Modi K Vishwanath, K Vishwanath Dada Saheb, Kasinadhuni Viswanath, Kasinadhuni Viswanath Modi, Modi Viswanath Twitter, Modi Hails Vishwanath, Director Kasinadhuni Viswanath, Director K Vishwanath, Modi Tweets On K Viswanath, Modi Congrats National Awardees, Vishwanath Couple Venkaiah Naidu, K Vishwanath Akshay Kumar Anil Kapoor, Dada Saheb Palke Award 2016, Dada Saheb Vishwannath, Venkaiah Felicitate Vishwanath, Talasani K Vishwanath, K Vishwanath KCR, KCR Meet K Vishwanath, K Vishwanath Telangana Government

Director K Vishwanath receives Dadasaheb Phalke award. PM Narendra Modi Congrats him along with National Awardees in twitter.

దాదాసాహెబ్ విశ్వనాథ్ కు మోదీ కంగ్రాట్స్

Posted: 05/04/2017 12:42 PM IST
Modi congratulate dada saheb vishwanth

తెలుగు సినీ పరిశ్రమకు మహర్దశ పట్టుకుంది. ఓవైపు బాహుబలి ద్వారా మన ఖ్యాతిని రాజమౌళి ఖండాంతరాలు దాటిస్తే.. తన ఆణిముత్యాల్లాంటి చిత్రాలతో తెలుగు కళామతల్లికి మణిహారం తొడిగిన వెటరన్ దర్శకుడు కే విశ్వనాథ్ కు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్క్ పురస్కారం అందజేసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆ గౌరవాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ప్రపంచంలో ఎక్కడ నా అభిమానులు ఉన్నా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అవార్డు అందుకున్న సమయంలో లెజెండరీ దర్శకుడు ప్రసంగించాడు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశ్వనాథ్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేయటం విశేషం. అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ మేకర్ అంటూ పొగడ్తలు కురిపిస్తూ ఆయకు పురస్కారం రావటం పై శుభాకాంక్షలు తెలియజేశాడు. 64 ఫిల్మ్ జాతీయ అవార్డులు గెలుచుకున్న వారందరికీ కూడా కంగ్రాట్స్ తెలియజేశాడు. ఇక నిన్న కార్యక్రమంలో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ లు విశ్వనాథ్ కు ఆప్యాయ ఆలింగం చేసుకుని ఫోటోలు దిగారు కూడా.

తెలంగాణ ఘన స్వాగతం...

సినీ రంగ ప్రతిష్టాత్మక అవార్డు అందుకుని వస్తున్న కే విశ్వనాథ్ కు ఘన స్వాగతం పలకాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన నివాసంలో విశ్వనాథ్ కు సన్మానం చేశారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  K Vishwanath  Dada Saheb Palke Award  

Other Articles