Actress Bhavana to marry Naveen soon

Actress bhavana to marry in october

Bhavana Menon, Bhavana Engagement, Bhavana Menon Naveen, Kannada Producer Naveen, Naveen Marry Bhavana, Bhavana Boyfriend, Bhavana Naveen Engagement, Bahavana October Marriage, Bhavana Wedding, Bhavana Simple Marriage

Malayalam Actress Bhavana Menon to marry Kannada Producer Naveen soon. Bhavana Mother says they To Tie The Knot In October.

నటి భావన పెళ్లి డేట్ ఫిక్స్

Posted: 05/04/2017 10:08 AM IST
Actress bhavana to marry in october

మళయాళం స్టార్ హీరోయిన్ భావన వివాహం ముహూర్తం ఖరారైంది. ఒంటరిగా కారులో వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఆ చేదు అనుభవం తర్వాత చాలా కాలం ఎలా కోలుకుంటుందోనన్న ఆలోచనను పటాఫంచల్ చేసేస్తూ మళ్లీ తొందరగానే బౌన్స్ బ్యాక్ అయ్యింది. షూటింగ్ లో పాల్గొనటమే కాదు, తనపై దారుణానికి తెగబడ్డ వాళ్లని వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

ఇక దాడి తర్వాత ఆమె ప్రియుడు, కన్నడ సినీ నిర్మాత నవీన్ అండగా నిలిచారు. ఘటన చోటుచేసుకున్న కొద్ది కాలానికే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నాడు. ఆపై భావన మీడియా ముందుకు రావటం, జరిగిన దారుణాన్ని వివరించి, న్యాయపోరాటం చేస్తుండటం తెలిసిన సంగతే. ఇదే సమయంలో తన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాకూడదని డిసైడ్ అయ్యిందంట. అందుకే త్వరలో పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంది.

భావన తల్లి పుష్ప వాళ్ల పెళ్లిపై ఓ ప్రకటన కూడా చేసేసింది. అక్టోబర్ 27న భావన సొంత ఊరు త్రిచూర్ లో వివాహం జరగనుందట. వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించనున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి ఎవరిని ఆహ్వానించాలి? అన్న విషయాన్ని భావనకే వదిలేస్తున్నామని పుష్ప తెలిపారు. ఆమెపై జరిగిన వేధింపుల వెనుక సినీ ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు తెలిసిందే. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ కోసం భావన స్విట్జర్లాండ్ లో ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Bhavana  Producer Naveen  Marriage  

Other Articles