Rajamouli remuneration for Baahubali Two Parts

Rajamouli remuneration for baahubali project

Baahubali, Baahubali Director, Rajamouli Remuneration, SS Rajamouli Movies, Rajamouli Baahubali Profits, Baahubali Two Parts Profits, Baahubali Movie Remunerations, Baahubali Actors Remunerations, Baahubali Director, Director Rajamouli, Rajamouli Baahubali 2 Collections, Rajamouli Share Profits, Rajamouli Original Remuneration, Rajamouli Real Remuneration, Samantha Baahubali 2 Review, Samantha About Rajamouli, Baahubali 2 Samantha

Director Rajamouli Remuneration revealed. Rajamouli is going to get one third share of the total profits for the two parts. Samnatha interesting review on Baahubali.

రాజమౌళి రెమ్యునరేషన్ లెక్క తేలింది

Posted: 05/02/2017 11:24 AM IST
Rajamouli remuneration for baahubali project

బాహుబలి లాంటి విజువల్ వండర్ రెండు పార్ట్ లలో ఆవిష్కరించిన దర్శకధీరుడు రాజమౌళి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతుంది. ఐదేళ్లు కఠోర శ్రమతో ఓ మహర్షిలా అహర్నిశలు తన టీంతోపాటే తాను పడ్డ కష్టానికి ఇప్పుడు వస్తున్న ప్రశంసలు సంతృప్తినిస్తున్నాయనే చెప్పొచ్చు. అయితే జక్కన్న కష్టానికి ప్రతిఫలం అదేనండీ రెమ్యునరేషన్ ఎంత ముట్టజెప్పారు అన్నదే ఇప్పుడు అసలు టాపిక్.

నిర్మాతలు శోభు, ప్రసాద్ లు మొదటి పార్ట్ విషయంలో ఏమోగానీ రెండో దాంట్లో మాత్రం భారీగానే లాభాలు అర్జించబోతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఇక బాహుబలి రెండు పార్ట్ ల కోసం మూడో వంతు లాభాలను జక్కన్న ఆర్జించబోతున్నాడని టాక్. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇలా అన్నింటిలో వచ్చే ఫ్రాఫిట్స్ లో రాజమౌళి భాగస్వామినే అన్నమాట. అంటే ఒకవేళ సినిమాకు 750 కోట్ల లాభాలు గనుక వస్తే అందులో 250 కోట్లు రాజమౌళి రెమ్యునరేషన్, వెయ్యి కోట్లు వస్తే 300 కోట్లు... ఇలా అన్నమాట.

ఇక ఐదేళ్లలో దర్శకుడి మొత్తం ఖర్చులు భరించిన నిర్మాతలు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన రాజమౌళికి షేర్ అందించబోతున్నారు. రాజమౌళి అంకిత భావానికి, కష్టానికి ఇది వెలకట్టలేనిదే కావొచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోలు ఇలా లాభాల్లో షేర్స్ పంచుకుంటుంటారు. కానీ, దర్శకుల్లో మాత్రం రాజమౌళి అందుకుంటున్న ఆ భారీ లాభాలు హాట్ టాపిక్ గా మారాయి.

సమంత రివ్యూ...

ఇక దేశం మొత్తం బాహుబలి సినిమా గురించి రివ్యూలు ఇస్తుంటే.. నటి సమంత మాత్రం మొత్తం రాజమౌళి కష్టం గురించే ట్వీట్ చేసింది. ఓ సినిమా విషయంలో రాజమౌళి ఎంత నిబద్ధతతో ఉంటాడో చెబుతూ రాజమౌళి స్కూల్.. అందులో శ్రమ.. అసలు ఓటమి ఎందుకు రాదో అంటూ ఓ పెద్ద ట్వీట్ లోనే వివరించింది శామ్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Director Rajamouli  Remuneration  Profits Share  

Other Articles