Prabhas Saaho Teaser Leaked Online.

Prabhas saaho movie teaser leaked online

Prabhas, Prabhas Saaho Teaser, Saaho Teaser, Saaho Teaser Online, Prabhas Next Teaser, Prabhas 19th Movie, Prabhas 19th Teaser, Saaho Teaser Leak, Saaho Teaser Photos

Prabhas' next film titled Saaho, teaser to be attached to Baahubali 2. But, leaked Online Before Release.

ప్రభాస్ సాహో టీజర్ లీకయ్యింది

Posted: 04/26/2017 04:41 PM IST
Prabhas saaho movie teaser leaked online

ఏప్రిల్ 28న కేవలం ఒక్క బాహుబలి ది కంక్లూజన్ తోనే కాదు తన కొత్త టీజర్ తోనూ ప్రభాస్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సాహో అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఆ ముహుర్తాన్నే టీజర్ కోసం అనౌన్స్ చేసింది.

అయితే ఆ చిత్ర టీజర్ ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయ్యి హల్ చల్ చేస్తోంది. స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోయే సాహోలో ప్రభాస్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడని టాక్. అయితే చిత్ర టీజర్ ను చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ దానిని అంత జాగ్రత్తగా బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు. ఎలా జరిగిందో తెలీదుగానీ యూట్యూబ్ లో కొన్ని ఛానెళ్లు ''సాహో'' అఫీషియల్ టీజర్ ను నెట్ లో పెట్టేశాయి.

అయితే వెంటనే అప్రమత్తమైన యూనిట్ దానిని తొలగించేసింది. అయినప్పటికీ అందులో ఉన్న ఫోటోలు మాత్రం నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇక టీజర్ చూసిన కొందరు దానిపై ఫీడ్ బ్యాక్ తో కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ ముఖంపై ఉన్న ఉన్న రక్తం చూసి విలన్ నవ్వుకుంటుంటే.. సార్.. అది వాడిది కాదు. మన కుర్రాళ్లది అని చెప్పే డైలాగ్ పేలిపోయిందని అంటున్నారు. మొత్తానికి చాలా వయొలెన్స్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి మాత్రం ట్రీట్ లా ఉంటుందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Teaser  Leaked Online  

Other Articles