Baahubali 2 Producer Shobu Yarlagadda rubbishes leaked Scenes.

Baahubali 2 leaks are false

Shobu Yarlagadda, Shobu Yarlagadda Leak Scenes, Baahubali 2 Scenes Leak, Baahubali 2 Leaked Scenes, Baahubali 2 Leak, Baahubali 2 Whatsapp Leak, Baahubali 2 Tamil Scenes Leak

Producer Shobu Yarlagadda rubbishes rumours Baahubali 2 scenes leaked online. Producer Shobu Yarlagadda claimed that the movie was not screened anywhere except for the censor boards in various countries. But, Scenes viral on WhatsApp Now.

బాహుబలి 2 సీన్ల లీకేజీ పై శోభు క్లారిటీ

Posted: 04/27/2017 08:40 AM IST
Baahubali 2 leaks are false

అలుపెరగని యోధుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి కి ‘బాహుబలి: అసలు పరీక్షగా మారబోతుంది. ఇప్పటిదాకా తెలుగు సినీ చరిత్రలో సీక్వెల్ లు హిట్ కొట్టిన దాఖలాలు లేవు. మరి బాహుబలి ఫ్రాంచైజీ లో సెకండ్ పార్ట్ గా రాబోతున్న ది కంక్లూజన్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందా? అని అంతా ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో కట్టప్ప సీక్రెట్ పై సస్పెన్స్ కాస్త వార్నింగ్ గా మారిపోయింది. ఒకవేళ ముందుగా సీక్రెట్ ఎవరికైనా తెలిసి రివీల్ చేస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని సోషల్ మీడియాలో అభిమానులు హెచ్చరించే స్థాయికి చేరింది.

ఈ ఆసక్తి తనకు మరింత టెన్షన్ తెచ్చిపెడుతోందని రాజమౌళి చెబుతున్నాడు. మాయాబజార్ సినిమా ఇన్సిఫిరేషన్ తోనే తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించానని నిన్న తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ప‌లు ఫొటోలు ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్ప‌టికే విదేశాల్లో విడుదలైపోయిందని ప‌లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆ చిత్రం నిర్మాత శోభు యార్లగడ్డ ‘బాహుబలి-2’ సినిమాకు సంబంధించినంతవరకు ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్కడా ప్రదర్శనలు మొదలుకాలేదని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న ప‌లు ఫోటోలు ఎక్కడినుంచి లీక‌య్యాయో ఇంకా స్ప‌ష్టత లేద‌ని చెప్పారు. త‌మ సినిమా ఇతర దేశాల్లో కూడా రిలీజ్ కానుంద‌ని, ఆయా దేశాల్లో సెన్సార్‌ సభ్యులకు ఈ సినిమాను చూపించామ‌ని తెలిపిన ఆయ‌న‌... ఆ సమయంలో ఎవరో ఫోటోలు తీసి సినిమాకు సంబంధించిన ప‌లు ఫొటోల‌ను నెట్‌లో పెట్టి ఉంటారని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. తమిళ వెర్షన్ సన్నివేశాలు లీక్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి ఒకటిన్నర నిమిషం దృశ్యాలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. భల్లాలదేవ పట్టాభిషేకం పేరుతో ఉన్న వీడియోలో అమరేంద్రుడు భళ్లాలుడికి కాపలాగా నడిచిరావటం చూడొచ్చు. ప్రస్తుతం వాట్సాఫ్ లో ఇంటర్వెల్ కు సంబంధించిన ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Scenes Leaked  Shobu Yarlagadda  

Other Articles