3వ అంతస్థు నుంచి దూకి.. ప్రాణాలతో బయటపడ్డ కమల్.. Kamal Haasan's Chennai house on fire; actor survives unhurt

Kamal hassan narrow escapes from fire accident with help of staff

Kamal Hassan, Chandra Hassan, Fire at Kamal Hassan house, Kamal Hassan Chennai residence, Kamal Hassan house fire, Chennai, Entertainment news, Bollywood news

Actor Kamal Hassan, who was caught in an accidental fire at his residence in Alwarpet and his staff had apparently rescued him from the flames

తృటితో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకున్న కమల్ హాసన్

Posted: 04/08/2017 11:11 AM IST
Kamal hassan narrow escapes from fire accident with help of staff

ప్రముఖ విలక్షన నటుడు, హీరో కమల్ హాసన్ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇటీవల ప్రమాదంలో కాలు విరిగి  ఏడాది పాటు షూటింగులకు దూరంగా ఉన్న కమల్.. మరోసారి ప్రమాదంలో చిక్కుకున్నారన్న వార్త అతని అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. అయితే కమల్ తాజగా జరిగిన ప్రమాదం నుంచి తృటితో తప్పించుకోవడంతో అతని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కమల్‌ సహా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

కమల్ నివాసంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాగా కాలు విరిగిన ఘటన నుంచి పూర్తిగా కొలుకోని కమల్.. ఈ అగ్ని ప్రమాదం నుంచి మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఆయన తన అభిమానులతో ఈ విషయాలను సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తన నివాసంలో క్రితం రోజు రాత్రి అగ్న ప్రమాదం సంభవించిందని పేర్కోన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని  ట్వీట్‌ చేశారు.

అగ్ని ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడేందుకు ఏకంగాా మూడవ అంతస్థు నుంచి కిందకు దూకాల్సి వచ్చిందని కమల్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని కూడా చెప్పారు. తాను సురక్షితంగా ఉన్నానని.. సకాలంలో స్పందించిన తన సిబ్బందికి ధన్యవాదాలని కూడా చెప్పుకోచ్చారు. అయితే ఈ ప్రమాదం వల్ల తన ఊపిరితిత్తులు పూర్తిగా పొగతో  నిండిపోయాయంటూ ట్వీట్‌​  చేశారు.

తన పట్ల, తన సినిమాల పట్ల ప్రేమను, అదరణను కనబర్చి.. తనకు ప్రమాదం జరిగిందన్న వార్త తెలియగానే ఆందోళనను  వ్యక్తం చేసిన అభిమాలను ధన్యవాదాలు తెలిపారు. కాగా  ఇటీవల కమల్‌ హాసన్‌  సోదరుడు చంద్రహాసన్‌  కన్నుమూశారు. సోదరుడి సంతాప దినాల్లో వున్న కమల్‌ అగ్ని ప్రమాదం బారిన పడటం.. సురక్షితంగా బయటపడటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బహుబాషా చిత్రం శభాష్‌ నాయుడు షూటింగ్ పనులను త్వరలో మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  narrowly escape  fire tragedy  kollywood  bollywood  

Other Articles