ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ న్యాయస్థానం షాక్.. Junior NTR’s looks super scary

Junior ntr s look leaked from his next film and it looks super scary

junior ntr, nandamuri taraka ram, ntr jai luvkusa, ntr triple role, ntr upcoming films, kalyan ram, ntr kalyan ram, entertainment news

ahead of the official release of Junior NTR’s look from the film, fans have come across a mask, (a scary one at that), which is said to be one of the looks of NTR’s character.

గుబులురేపుతున్న ఎన్టీయార్ లీక్డ్ లుక్..

Posted: 03/26/2017 12:34 PM IST
Junior ntr s look leaked from his next film and it looks super scary

జనతా గ్యారేజ్ చిత్రం హిట్ అయిన తరువాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జూనియర్ తన అభిమానులను త్రిపాత్రాభినయంతో అలరించనున్నారు. ఈ మూడు విభిన్న పాత్రలలో నటించనున్న ఎన్టీయార్.. తన తాతయ్య నందమూరి ఎన్టీయార్ తరహాలోనే తన చిత్రంలో తానే విలన్ గెటప్ లోనూ కనిపించనున్నారు. ఈ టాక్ బయటకు వచ్చినప్పటి నుంచి ఎన్టీయార్ విలన్ రోల్ లో ఎలా వుంటారా..? అని అభిమానులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన త్వరలోనే టీజర్ కూడా విడుదల కానున్న నేపథ్యంలో అన్ లైన్ లో ఎన్టీయార్ వైరల్ గా మారారు. అయితే తాజాగా ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ కు సంబంధించిన లుక్ ఇదేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాడు. అయితే అవి ఎన్టీఆర్ ఫోటోలు కాదు. అచ్చు ఎన్టీఆర్ లా కనిపిస్తున్న మాస్క్లు నెట్టింట్లో సంచలనం చేస్తున్నాయి.

జై లవకుశ షూటింగ్ ప్రారంభానికి ముందు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రయాలజీకి వర్క్ చేసిన ప్రఖ్యాత హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ వాన్స్ గార్ట్ వెల్, ఎన్టీఆర్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఎన్టీఆర్ లుక్ విషయంలో ఎన్నో డిజైన్స్ తరువాత ఫైనల్ గా ఈ లుక్ ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా రిలీజ్ అయిన ఫోటోలతో ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh