50 లక్షలు ఇవ్వకుంటే అలియాను అంత పని చేస్తానన్నాడా? | Extortionist threatens to kill Alia Bhatt if not paid Rs 50 lakh.

Alia bhatt mahesh bhatt get a death threat

Mahesh Bhatt, Mahesh Bhatt Family, Mahesh Bhatt Death Threat, Alia Bhatt Death Threat, Mahesh Family Death Threat, Mahesh Bhatt Daughter, Mahesh Bhatt Wife Soni Razdan, Soni Razdan Alia Bhatt, Alai Bhatt Family, Soni Razdan Daughter, Alai Bhatt Mother

Filmmaker Mahesh Bhatt received a death threat from an unidentified caller who reportedly demanded Rs 50 lakh. The person also threatened to kill Mahesh Bhatt's wife Soni Razdan and daughter Alia Bhatt if he failed to deposit the amount in a Lucknow-based bank branch. The incident took place on February 26. Mahesh Bhatt filed a case in Juhu police station on Wednesday. Later that unidentified caller found by UP Police arrested.

అలియా భట్ ఫ్యామిలీకి బెదిరింపు కాల్.. వ్యక్తి అరెస్ట్

Posted: 03/02/2017 10:57 AM IST
Alia bhatt mahesh bhatt get a death threat

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారంట. సీనియర్ మేకర్ ఆమె తండ్రి అయిన మహేష్ భట్ కు ఇందుకు సంబంధించి ఓ ఫోన్ కాల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఆయన ముంబైలోని క్రైమ్ బ్రాంచ్ లో ఫిర్యాదు చేయగా, యూపీ మరియు మహారాష్ట్ర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. 

ఫిబ్రవరి 26న ఓ ఆగంతకుడు తనకు ఫోన్ చేసి రూ. 50 లక్షలు ఇవ్వకుంటే తన కుమార్తె అలియాను, భార్య సోనీను చంపేస్తానని బెదిరించాడని మహేష్ చెబుతున్నాడు. తాను ఓ గ్యాంగ్ కు లీడర్ ను అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి ఫోన్ చేసి డబ్బు ఇవ్వకుంటే నీ ఫ్యామిలీ డేంజర్ లో పడుతుందని హెచ్చరించాడని ఆయన తెలిపాడు. మొదటి ఉత్తుత్తి బెదిరింపని లైట్ తీసుకున్నప్పటికీ, ఆపై వరుసగా వాట్స్ యాప్, ఎస్ఎంఎస్ లు పంపుతూ, ఈ హెచ్చరికను లైట్ తీసుకోవద్దని చెప్పాడని ఆయన వివరించాడు.

అంతేకాదు సొమ్మును లక్నోకు చెందిన ఓ బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయాలని కూడా సూచించాడని భట్ తెలిపాడు. ఆలియా బాడీలోకి బులెట్లను దింపుతానని సదరు ఆగంతకుడు మెసేజ్ లు చేస్తున్నాడంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మహేష్ భట్ నివాసం ప్రాంతంలో భద్రతను పెంచారు. ఇక తన ట్విట్టర్ లో కూడా ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నాడు. కాగా, 2006లో రవి పూజారీ అనే అండర్ వరల్డ్ డాన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న కోపంతో భట్ ఆఫీస్ పై కాల్పులకు పాల్పడటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Mahesh Bhatt  Death Threat  Alia Bhatt  Soni Razdan  

Other Articles