ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ యేడాది మోస్ట్ అవెయిటింగ్ మూవీగా ఉన్న బాహుబలి ది కంక్లూజన్ ప్రస్తుతం పనులను చకచకా జరుపుకుంటూ ఏప్రిల్ 28కి రిలీజ్ కు రెడీ అయిపోతుంది. ఇక ప్రభాస్ బర్త్ డే ముందు రోజు నుంచి ప్రారంభమైన ప్రమోషన్ ఇప్పుడు ఊపు అందుకుంది. ఆపై రానా లుక్కు, బాహుబలి-దేవసేన పోస్టర్, మొన్న శివరాత్రికి శివుడి గజతాండవం ఇలా ఒక్కో పోస్టర్ తో అంచనాలను మరింత పెంచేశాడు.
ఇక ఇప్పుడు ట్రైలర్ గురించి ఓ కంక్లూజన్ కి వచ్చేశాడు జక్కన్న. ఈ చిత్రం ట్రైలర్ రెడీ అయిందని, ప్రస్తుతం దీన్ని తెరపై ఎలా ఉందన్న విషయాన్ని పరీక్షిస్తున్నామని చిత్రం సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో ట్రైలర్ తయారైందని చెబుతూ, దీన్ని పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు సెంథిల్.
At#AnnapurnaStudios Working on Trailer of #Baahubali2 Making sure Everything is Fine with the Screen Calibration, With #CVRao & #ShivaKumar pic.twitter.com/BsvKlOO6Js
— KK Senthil Kumar (@DOPSenthilKumar) March 2, 2017
ఈ సినిమాపై వర్క్ చేస్తున్నామని, సీవీ రావు, శివకుమార్ లతో కలసి తెరపై ఎలా కనిపిస్తుందన్న విషయాన్ని చూస్తున్నామని కామెంట్ పెట్టాడు. కాగా, ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో విజువల్ ఎఫెక్ట్స్ మూలంగానే డిలే జరిగిందని రాజమౌళి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ట్రైలర్ రెడీ అయ్యిందన్న వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. మొదటి పార్ట్ సమయంలోలాగానే ముందు ఓ చిన్న టీజర్ ను వదిలిపై ఆపై ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more