పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాకు కొత్త చిక్కులు ఎదురు కాబోతున్నాయా? రైట్స్ కొనుగోలు విషయంలో నిర్మాత శరత్ మరార్ అవక తవకలకు పాల్పడుతున్నాడా? అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి. నిజానికి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లను ఆదుకునేందుకే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి మరీ కాటమరాయుడి సినిమా తీస్తున్నాడని అప్పట్లో చెప్పుకున్నాం.
అంతేకాదు కాటమరాయుడు సినిమా హక్కులను వారికే ఇస్తామని పవన్ సమక్షంలోనే నిర్మాత శరత్ మరార్ హామీ కూడా ఇచ్చాడంట. కానీ, ఇప్పుడు మాట బయ్యర్లకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారంటూ ఓ బయ్యర్ సంచలన ఆరోపణలకు దిగాడు. సంపత్ అనే పవన్ ఫ్యాన్,సర్దార్ సినిమా హక్కులను కృష్ణా జిల్లా కోసం రూ.4.5కోట్లతో కొనుగోలు చేశాడు. సినిమా డిజాస్టర్ కావటంతో షేర్ రూ.2.58కోట్లు మాత్రమే వచ్చింది. ఇక ఈ నష్టాన్ని పవన్ దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే.. నష్టపోయిన వారిని ఆదుకునేందుకే కాటమరాయుడు సినిమా తీస్తున్నారని ప్రోడ్యూసర్లు చెప్పారు. అంతేకాదు ఆ సినిమా రైట్స్ ఇస్తామని హమీ కూడా ఇచ్చారంట. దీంతో వారంతా సంతోషించారు.
ఆ మధ్య మళ్లీ కదిలిస్తే ఫిబ్రవరి మొదటి వారంలో కలవమన్నారు. ఇక ఇప్పుడు నిర్మాత శరత్ మరార్.. పవన్ కార్యాలయంలోని శ్రీనివాస్ ఫోన్ ఎత్తటం లేదు. మెసేజ్ లకు స్పందించటం లేదంట. ‘‘నాలాంటి వాడికి రూ.2కోట్ల నష్టం అంటే సామాన్యమైన విషయమే. నా పరిస్థితుల్లో వేరే వారు ఉంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయేవారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు సంపత్. పవన్ ఫ్యాన్స్ గా తమ అభిమాన నటుడి సినిమాను తాము భారీ ధరకు వెచ్చించి కొన్నామని.. భారీగా నష్టపోయినట్లుగా ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలు సర్దార్ సినిమా రైట్స్ వ్యవహారంలోనే పెద్ద కిరికిరి జరిగిందని వివరించాడు. విడుదలకు ముందు ఆఫీసుకు పిలిపించి.. సినిమాను ఈరోస్ కు అమ్మినట్లుగా చెప్పి.. వారి దగ్గర కొనమన్నారని.. పవన్ బాబు మీదున్న నమ్మకం.. వారు చెప్పినట్లే అగ్రిమెంట్లను కనీసం చదవకుండా సంతకం చేసేశామని.. ఏడాది తర్వాత మా సంగతేమిటంటే.. ఇప్పుడు కూడా ఈరోస్ వద్దకు వెళ్లి అడగాలంటూ చెబుతున్నారని.. ఇదేం న్యాయమని సంపత్ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పవన్ తర్వాత చిత్రం కాటమరాయుడి సినిమా నష్టపోయిన వారి కోసం చేస్తున్నదే అయినా.. శరత్ మురార్.. శ్రీనివాస్.. తమ సన్నిహితులు.. బంధువులకు అమ్మారని ఆరోపించారు.
‘ఈస్ట్.. వెస్ట్.. వైజాగ్ లాంటి సెంటర్లు కచ్ఛితంగా లాభాలు వస్తాయి. అలాంటి చోట్ల అంతా శ్రీనివాస్ తన బంధువులకు సినిమాను అమ్మేశారు. మా సంగతేమిటంటే.. ఈ రోస్ వద్దకు వెళ్లాలని చెబుతున్నారు. మొదట్లో చెప్పిన దానికి.. ఇప్పటికి సంబంధం లేదు. అదేమంటే.. బెదిరింపులకు దిగుతున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. తన ఆవేదనను చెప్పుకునేందుకు పవన్ కల్యాణ్ ఆఫీసుకు వెళితే.. అక్కడ ఆయన అపాయింట్ మెంట్ దొరకటం లేదని.. పార్టీ ఆఫీసుకు వెళ్లాలని చెబుతున్నారని.. పార్టీ ఆఫీసుకు వెళితే పార్టీ సంగతులు తప్పించి మరింకేమీ మాట్లాడరంటున్నారని చెప్పిన సంపత్.. ఎక్కడికి వెళ్లాలో తెలీటం లేదన్నాడు.
సర్దార్ సినిమాను కొనేటప్పుడు అత్తారింటికి దారేది సినిమా కలెక్షన్లు చూపి రూ.4.5 కోట్లు డిమాండ్ చేశారు. ఏం ఫర్లేదు.. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పారు. ఇది పవన్ కల్యాణ్ బ్యానర్ అని మీకేం నష్టం జరగదని చెప్పారు. తమ బ్యానర్ లో తర్వాత రాంచరణ్.. సాయిధరమ్ తేజ్ సినిమాలు వస్తున్నాయని మాటలు చెప్పారు . ఈ రోజు అస్సలు మాట్లాడటం లేదు? మేం ఏమైపోవాలి?’’ అంటూ ప్రశ్నిస్తున్నాడు.
పవన్ కు సన్నిహితులుగా ఉంటున్నవారు.. ఆయన పేరును వాడుకొని లాభాలు పొందుతున్నారని.. పవన్ కల్యాణ్ తమకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే తామీ ప్రెస్ మీట్ పెట్టినట్లుగా సంపత్ వ్యాఖ్యానించాడు. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది చూడాలి మరి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more