మోస్ట్ కాంట్రవర్సీ మూవీ రిలీజ్ అవుతోంది... Banned violent movie got release date in Tollywood.

Kollywood controversy movie got telugu release date

Kollywood Metro Movie, Metro Telugu Movie, Metro 2017 Movie, 2017 Metro Movie, Metro Movie, Controversy Kollywood Movie, Kollywood Banned movie, Metro Movie Release Date

Kollywood most violent banned movie‘Metro’ got release in Telugu.

కాంట్రవర్సీ మూవీ మెట్రోకు రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 02/20/2017 05:51 PM IST
Kollywood controversy movie got telugu release date

సాధారణంగా వివాదాస్పద చిత్రాలు ఆపై విపరీతమైన హైప్ సంపాదించేయటం తరచూ మనం చూస్తున్నాం. కానీ, కోలీవుడ్ లో మాత్రం ఓ సినిమా తీవ్ర వివాదం రాజేసింది. ఆనంద్ కృష్ణ అనే దర్శకుడు గతేడాది మెట్రో అనే ఓ సినిమా తీశాడు. సీరియల్ మర్డర్లు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాలో జాతీయ అవార్డు విన్నర్ బాబీ సింహా ఓ కీల్ రోల్ పోషించగా, శిరీష్, శేంద్రన్, నిషాంత్ తదితరులు నటించారు.

హింస ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను రిలీజ్ కాకుండా బ్యాన్ చేశారు. అయితే కంటెంట్ మీద నమ్మకంతో దర్శకుడు సెన్సార్ బోర్డును రివ్యూ కోరగా, పలు మీటింగ్ ల తర్వాత ఎట్టకేలకు ఆ సినిమా రిలీజ్ అయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా మాత్రం అది అంత సక్సెస్ కాలేకపోయింది.

ఇక ఇప్పుడు ఆ సినిమాను తెలుగులోకి దించేందుకు యత్నిస్తున్నారు మేకర్లు. మెట్రో పేరుతోనే తెలుగులో ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కాబోతుంది. ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి దీనిని తెలుగులో రిలీజ్ చేస్తుండగా, సింగర్ గీతా మాధురి ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. ఓ కాంట్రవర్సరీ సినిమా గా హైప్ క్రియేట్ చేసిన మెట్రో తెలుగు లో ఏ మేర ఆశిస్తుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Metro Telugu Movie  Release Date  

Other Articles