పవన్ రాజకీయాల్లో ఆయన హ్యాండ్ లేదంట .. మరి? | Bandla Ganesh on Pawan kalyan Political Speeches.

Trivikram not behind pawan political speeches

Bandla Ganesh Inteview, Bandla Ganesh Pawan kalyan, Pawan Kalyan Political Speeches, Pawan kalyan Trivikram Srinivas, Pawan Trivikram, Trivikram Janasena, Janasena Pawan kalyan, Pawan Kalyan Political Speeches, Trivikram Bandla Ganesh

Bandla Ganesh denies rumour that Trivikram behind Pawan Kalyan Political Speeches. Says Pawan capable to designs and pens speeches to himself.

పవన్ స్పీచ్ లు రాసేది ఆయన కాదంట!

Posted: 01/28/2017 04:03 PM IST
Trivikram not behind pawan political speeches

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి స్టార్ హీరోగా ఎంత క్రేజ్ ఉందో, ప్రస్తుతం పొలిటికల్ గా కూడా అంతకు మించే ఫాలోయింగ్ ను సంపాదించేసుకున్నాడు. సమస్యలు త్వరగతిన పరిష్కారం అయ్యేందుకు ఓ సంధాన కర్తగా ప్రజలు పవన్ ను భావించటమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే పవన్ చేసే ప్రసంగాలపై గత కొంత కాలంగా రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ ల తరహాలో పవన్ కి సన్నిహితుడైన త్రివిక్రమ్ రాసిస్తే.. దానిని చదివి వినిపిస్తాడంటూ కొంత మంది ఎద్దేవా చేయటం కూడా చూశాం.

అయితే వాటన్నింటిపై స్పందించాడు పవన్ కు సన్నిహిత వ్యక్తి, గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేశ్. ఆ కామెంట్లపై తనకు చాలా కోపం వచ్చిందని చెబుతున్నాడు. పవన్ రాజకీయ ఎదుగల ఓర్వలేకే కొందరు అలా మాట్లాడుతున్నారని అంటున్నాడు. పవన్ లో ఓ మంచి రచయిత దాగున్నాడన్న బండ్ల సొంతంగా ఉపన్యాసాలు రాసుకునే సత్తా ఉందంటున్నాడు. అంతేకాదు తనకి ఆ విషయంలో ఎవరి సహకారం అక్కర్లేదని కూడా తేల్చేశాడు.

2019 ఎన్నికల్లో జనసేన జయకేతనం ఎగరవేస్తుందని, అత్యధిక స్థానాల్లో గెలిచి పవన్ ముఖ్యమంత్రి కూడా అవుతాడని బండ్ల జోస్యం చెబుతున్నాడు. ఇక రాజకీయాల సంగతి పక్కనబెడితే పవన్ తో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కూడా తెలిపాడు ఈ నటుడు కమ్ నిర్మాత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Janasena Party  Political Speeches  Trivikram  

Other Articles

Today on Telugu Wishesh