ఆ సినిమా టీజర్ పై బండ బూతులు.. ఏం చూపించాడు? | Devuda movie in controversy.

Dyavuda movie teaser controversy

Devuda movie, dyavuda telugu movie, Devuda teaser, dyavuda teaser, most controversy telugu teaser, Telugu movie controversy, dyavuda movie teaser, Devuda movie actress, Dyavuda actress

Devuda/dyavuda telugu movie teaser out. Controversy now.

ద్యేవుడా! ఇదేం టీజర్ ??

Posted: 01/07/2017 11:09 AM IST
Dyavuda movie teaser controversy

ప్రజల సెంటిమెంట్లతో సొమ్ము చేసుకోవటం అనే సులువైన వ్యాపారం ఈనాటిది కాదు.. అనాదిగా కొనసాగుతూ వస్తుందే. అయితే సినిమాల విషయానికొచ్చే సరికి ఆ వ్యవహారం కాస్త తేడాగా మారిపోతుంటుంది. వర్గాలుగా ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీయటం ద్వారా కాంట్రవర్సీ క్రియేట్ చేయటమే కాదు, తద్వారా అటెన్షన్ కొట్టేసి సినిమాపై హైప్ పెంచేసుకుంటున్నారు కొందరు మేకర్లు. ఇది వరకులా భక్తి సినిమాలు ఎందుకని అనుకున్నాడో ఏమో ఓ దర్శకుడు దేవుడిపైనే వివాదాస్పదమైన సినిమా తీసి వార్తల్లో నిలిచాడు.

రేసుగుర్రంలో బన్నీ నోటి నుంచి పేలిన ద్యేవుడా అనే డైలాగ్ పేరుతో తెలుగులో ఓ సినిమా రాబోతుంది. అంతా కొత్త వాళ్లతో తీయబోతున్న ఈ చిత్రంలో వివాదస్పద అంశాన్నే టచ్ చేశాడు దర్శకుడు. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడి తీసిన చిత్రమని పేర్కొంటూ ఏకంగా దేవుడి ముందే వింత చేష్టలతో టీజర్ ను ప్రదర్శించాడు. సాఫీగా సాగిపోతున్న ఓ మూడు యవ జంటల జీవితంలో అలజడి రేగుతుంది. అంతే వాళ్లంతా దేవుడికి వ్యతిరేకంగా మారిపోతారు.

 

దేవుడి ఫోటో పడేయడం - శివుడికి బీరు - సిగరెట్లతో అభిషేకం చెయ్యడం. మాంసం ముక్కలని నైవేద్యంగా పెట్టడం వంటి ఘోరమైన పనులను చూపించాడు. క్రియేటివి పేరిట అతగాడు చేసిన పనికి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. టీజర్ ను తొలగించకపోయినా, సినిమాను విడుదల చేసినా బాగోదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి వీటిపై సెన్సార్ వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dyavuda movie  Devuda Movie  teaser  controversy  

Other Articles