యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కత్తి తిప్పటం ఆపేశాడు. మొత్తానికి బాహుబలి షూటింగ్ కంక్లూజన్ కి చేరింది. పాత సంవత్సరంలోనే షూటింగ్ ముగించేద్దామనుకున్నప్పటికీ ఓ వారం ఆలస్యంగా గుమ్మడికాయ కొట్టేసింది జక్కన్న అండ్ టీం. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళియే తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించాడు.
'ప్రభాస్ తో షూటింగ్ పూర్తయిపోయింది. మూడున్నరేళ్ల సుదీర్ఘ ప్రయాణం చేశాం. థ్యాంక్స్ డార్లింగ్.. ఈ ప్రాజెక్టుపై నువ్వు నమ్మినంతగా వేరెవ్వరూ నమ్మకం ఉంచలేదు. అదే అన్నికంటే విలువైనది' అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక షూటింగ్ లాస్ట్ డేలో చిత్ర యూనిట్ అంతా కలిసి దిగిన ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. పూర్తి టెక్నీషియన్స్ తో ఉన్న ఆ ఫోటోలో సెంథిల్, రాజమౌళి తనయుడు కార్తీకేయ తదితరులు ఉన్నారు.
ఇక మిగిలింది సీజీ వర్క్, రికార్డింగ్ చకచకా పూర్తి చేసి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రమోషన్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు దర్శకధీరుడు. మరోవైపు ఈ నెల 25న షారూఖ్ ఖాన్ రాయిస్ రిలీజ్ ఉంది. అప్పుడే టీజర్ ను రిలీజ్ చేయాలన్న ఫ్లాన్ లో (సంక్రాంతికి కూడా కావొచ్చు!) చిత్ర యూనిట్ భావిస్తోందంట. ఇక ఎలాగూ ప్రభాస్ ఫ్రీ అయ్యాడు గనక మిగిలింది సుజిత్ సినిమా స్టార్ట్ చేయటం, అంతకు మించి డార్లింగ్ పెళ్లి.
And thats a wrap 4 prabhas
— rajamouli ss (@ssrajamouli) January 6, 2017
3.5 years. Onehellof a journey
Thanks darling.No one had as much belief on this project as you. That means a lot.
You See Happy Faces When It's A Wrap after Super Hectic Day And Night Shoots Of #Baahubali2 #WKKB pic.twitter.com/75S9Ekqy1C
— KK Senthil Kumar (@DOPSenthilKumar) January 6, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more