సూర్య మొండి ఘటం.. అనుకున్నది సాదించాడు | Suriya's Singam 3 gets a U certificate.

Censor board revise suriya singam 3

Suriya, Singam 3, Suriya S3, S3 censor details, Singam 3 U certificate, Singam 3 release date, Suriya's Singam 3, Suriya fight Censor board, S3 U/A to U

Suriya's Singam 3 gets a U certificate after revise, to release on 26th January.

యూనివర్సల్ కాప్ విత్ క్లీన్ యూ

Posted: 01/07/2017 12:34 PM IST
Censor board revise suriya singam 3

టైటిల్ విని ఇదేదో సూర్య కొత్త సినిమా అనుకునేరు. పట్టు వదలని విక్రమార్కుడు అంటే ఏంటో సూర్య చేసి మరీ చూపించాడు. తన కొత్త సినిమా సింగం-3 విషయంలో సెన్సార్ బోర్డుతో వాదులాడి మరీ సినిమాకు యూ సర్టిఫికెట్ ఇప్పించుకున్నాడు.

ముందుగా ఈ సినిమాకు యూ బై ఏ ఇచ్చింది సెన్సార్ బోర్డు. దీనిపై నిర్మాతగా ఉన్న హీరో సూర్య రివైజింగ్ కమిటీని సంప్రదించాడు. అంతేకాదు తమిళనాడులో సినిమాకు పన్ను రాయితీ లభించాలంటే అన్ని వర్గాలను అలరించేలా అంటే యూ సర్టిఫికెట్ కంపల్సరీ అన్న నిబంధన కూడా అక్కడ ఉంది. దీంతో తన సినిమాలో అసలు అలాంటి సీన్లు లేవని, కాబట్టి తన సినిమాను మళ్లీ సెన్సార్ చేయాలంటూ సూర్య అభ్యర్థించాడు.

దీంతో మళ్లీ సెన్సార్ చేసి అన్ని సక్రమంగా ఉన్నాయని ఓ నిర్థారణకు వచ్చిన బోర్డు ఈ యూనివర్సల్ కాప్ కి క్లీన్ యూ ఇచ్చేసింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డప్పటికీ మొత్తానికి అనుకున్నవన్నీ సక్రమంగా జరగటంతో రిపబ్లిక్ డే రోజున గర్జించేందుకు సింగం సిద్ధమైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suriya  Singam 3  Censor Certificate  

Other Articles

Today on Telugu Wishesh