ధృవ-మణి రత్నంకి ఓ చిన్న లింకు ఉందంట | Link between charan Dhruva and Mani Ratnam.

What ace director suggests ram charan

Ram Charan, Mani Rathnam, Ram Charan Mani Rathnam, Mani Rathnam’s advice to Charan, Ram Charan Mani Rathnam, charan Dhruva and Mani Ratnam, Mani Ratnam advice to Ram Charan, Mani Ratnam advice to Mega hero

Ram Charan took Mani Rathnam’s advice seriously and did Dhruva.

ధృవకు అసలు కారణం ఆయనా?

Posted: 12/24/2016 03:04 PM IST
What ace director suggests ram charan

అప్పటిదాకా మాస్ పంథా సినిమాలతో దూసుకెళ్లిపోతున్న రాం చరణ్ ఒక్కసారిగా ధృవతో మారిపోయాడు. కథ దగ్గరి నుంచి బాడీ లాంగ్వేజ్ తదితర విషయాల్లో మెగా పవర్ స్టార్ చాలా కేరింగ్ తీసుకున్నాడు. అందుకే టఫ్ టైంలో కూడా ఈజీగా 50 కోట్ల క్లబ్ లో చేరిపోగలిగాడు. అయితే ఓ హిట్ రీమేక్ పైనే ఎందుకు కన్నేశాడు. బీవీఎన్ ప్రసాద్ కథ తీసుకొచ్చినప్పుడు తాను ఎందుకంత ఎగ్జయిట్ అయ్యాడన్న విషయాలను చెర్రీ తెలిపాడు. శుక్రవారం సాయంత్రం జరిగిన ధృవ సెల్యూట్ టూ ఆడియన్స్ పంక్షన్ లో ఆ విషయాలను చెప్పుకొచ్చాడు.

అసలు దీనంతటికి కారణం ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంట. ఆయన ఇచ్చిన సలహాను తాను పాటించానని అంటున్నాడు మెగా హీరో రామ్ చరణ్. "గతంలో కలసినప్పుడు మణిరత్నం గారు నాకో సలహా ఇచ్చారు. రొటీన్ కమర్షియల్ కథలే కాకుండా ప్రయోగాత్మక కథలను కూడా అప్పుడప్పుడు విని, అలాంటి వాటిలో కూడా నటించమని మణి చెప్పారు. ఆయన సలహా పాటించడం వల్లే ధృవ సినిమా చేశాను. అదిప్పుడు మంచి హిట్టవడంతో హ్యాపీగా వుంది' అని చెప్పాడు చరణ్.

ఇక ఇప్పటి నుంచి రోటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసుకుంటూ వెళ్తానని తెలిపాడు. "నేను మొదటి నుంచీ రికార్డులకు వ్యతిరేకం. నంబర్ గేమ్ .. పొజిషన్ .. వంటి వాటికి కూడా నేను దూరం, ఇష్టముండదు. అలాంటివన్నీ పట్టించుకుంటే కొత్త తరహా చిత్రాలు చేయలేం. రొటీన్ అయిపోతాం. అందుకే వాటిని పట్టించుకోను" అని చెప్పాడు. త్వరలో సుకుమార్ దర్శకత్వంలో 80వ దశకంలో ఓ గ్రామీణ ప్రేమకథా చిత్రంలో చెర్రీ సరికొత్త లుక్ తో నటించబోతున్నాడంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Dhruva Movie  Mani Ratnam advice  

Other Articles