కవిత-శ్రీవాణి కెవ్వు కొట్లాట.. ఏం జరుగుతోంది? | Kavitha versus Srivani payment issue.

Senior actress kavita clash with srivani

Telugu Senior Actress Kavita, TV actress Srivani, Kavitha Srivani, Sri vani versus Kavitha, Kavitha payment clash, Srivani Kevvu Kabaddi, Kevvu Kabaddi, Kevvu Kabaddi actress, Kevvu Kabaddi Judge, Kevvu Kabaddi Clash

Actress Kavita clash with Srivani over payment issues.

కవిత వర్సెస్ శ్రీవాణి అసలేం జరిగింది?

Posted: 12/15/2016 09:19 AM IST
Senior actress kavita clash with srivani

రియాలిటీ షోలలో కావాలనే కాంట్రవర్సరీలు చేస్తూ ప్రేక్షకులను బురిడీ కొట్టించటం, ఆపై అదంతా షో టీఆర్పీ కోసమేనంటూ తెలిసి ప్రేక్షకులు వార్నీ అనుకోవటం తెలిసిందే కదా. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది మాత్రం రియల్ ఫైట్ గురించే.. దానికి కారణం ఆ నటీమణుల మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవ రావటమే...

సినీ నటి కవితతో, సీరియల్ నటి శ్రీవాణికి రెమ్యూనరేషన్ విషయంలో వివాదం రేగి మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేస్తోంది. దీనికి కారణం ఓ టీవీ షోలో వీరిద్దరూ పాల్గొనటమే. శ్రీవాణి భర్త విక్రమాదిత్య 'కెవ్వు కబడ్డి' అనే షోను నిర్వహిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానెల్ లో శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో 60 మంది టీవీ నటులు పాల్గొంటున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించాలని కవితను కోరారు. ఏడు రోజుల షెడ్యూల్, ఒకరోజు ప్రోమో షూట్ లో పాల్గొనాలని ఒప్పందం చేసుకున్నారు. రోజుకు 25 వేల రూపాయలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. దీనికి సంబంధించిన 75 వేల రూపాయలు ఆమెకు అందజేసి, మిగిలిన మొత్తానికి చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బ్యాంకుకు వెళ్లి మార్చుకునే సమయానికి స్టాప్ పేమెంట్ పెట్టడంతో అసలు వ్యవహారం మొదలైంది.

 

షెడ్యూల్ ప్రకారం షూటింగ్ లో పాల్గొన్నాక స్టాప్ పేమెంట్ ఎందుకు పెట్టారని కవిత ఆగ్రహాం వ్యక్తం చేటయంతో, ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓ ప్రైవేట్ మీడియా ఛానెల్ లో డిబేట్ లో పాల్గొన్న కవిత శ్రీవాణిని ఏకీపడేయగా, దానికి ఘాటుగానే రిప్లై ఇస్తోంది శ్రీవాణి. తాను కవిత ఫ్రీగా చేస్తోందని అనుకున్నానని చెబుతోంది. అంతేకాదు తన భర్తకు పదే పదే ఫోన్ చేయటం ఎందుకని, ఏదున్నా తనతో మాట్లాడాలంటూ మండిపడింది. కాగా, గతంలో ఓ భూ వివాదంలో వదినను కొట్టి శ్రీవాణి వివాదం రేపిన తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevvu Kabaddi  Kavitha Versus Srivani  Remuneration issue  

Other Articles

Today on Telugu Wishesh