పోర్న్ సినిమాల కంటే బాలీవుడ్ లోనే బూతు ఎక్కువగా... | sunny leone on Bollywood sexism

Porn movies better than bollywood

Sunny Leone, Porn Movies, Bollywood, Porn Industry better than Bollywood, Bollywood Industry Sunny Leone, Sunny Leone Sexism, Sunny Leone BBC interview, BBC sunny leone

Sunny Leone opined that Bollywood shows more sexism than Porn Industry.

బాలీవుడ్ లోనే పోర్న్ ఎక్కువగా ఉందా?

Posted: 12/13/2016 02:29 PM IST
Porn movies better than bollywood

ఈ మాటలు అంటుంది ఎవరో కాదు.. ఒకప్పుడు పోర్న్ ఇండస్ట్రీలో దుమ్మురేపి రిటైర్ అయిన శృంగార తార సన్నీలియోన్. పోర్న్ సినిమాలో నటించిన తాను బాలీవుడ్ లో అంతకన్నా ఎక్కువ బూతునే చూడాల్సి వస్తుందని అంటోంది. ఈ మధ్యే బీబీసీ విడుదల చేసిన టాప్-100 మహిళల జాబితాలో సన్నీ స్థానం సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఆ ఛానెల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలే చెప్పుకొచ్చింది.

పోర్న్ ఇండస్ట్రీ, బాలీవుడ్ లో ఈ రెండింటిలో చాలా తేడాలే తాను చూశానని అంటోంది. పోర్న్ లో నిజాయితీతో కూడిన శృంగారం ఉంటుంది. కానీ, బాలీవుడ్ లో అలా కాదు. సెక్సీజమ్ అనేది చాలా ఎక్కువగా చూపించాలి. అందుకోసం బలవంతంగా నటించాల్సి ఉంటుంది అని తెలిపింది. ఇక్కడి మేకర్లు అందుకోసం తెగ యత్నిస్తారు. అది నాకు నవ్వు తెప్పిస్తుంది. నా గతం ఏంటో? నేనేం ఏం చేశానో ? అన్నది నాకు బాగా తెలుసు. వాళ్లకి సన్నీలియోన్ కావాలి, నన్నో ఆటబొమ్మగా చూసేవారు. ఆ ఇమేజ్ నాకు నేను సృష్టించుకుంది అలాంటప్పుడు బాధపడాల్సిన అవసరం నాకేముంది అంటోంది.

ఇక తన వీడియోలతో సోసైటీ, సాంప్రదాయాలు పాడైపోతుందన్న ఫిర్యాదు పై బిగ్గరగా నవ్వుతూ... ఇది పరస్పర అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ ఉన్న దేశం. నా వీడియోలు పాడువని వాళ్లకేలా తెలుసు? ఎందుకంటే వాళ్లూ అవి చూస్తారు కాబట్టి. నేను చేసే పని తప్పు అనే ముందు అవి చూడకండి. గూగుల్ లో నా గురించి పనిమాలా వెతకటం మానేయండి అంటూ విమర్శకులకు చురకలు అంటించింది సన్నీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone about sexism  Bollywood Porn Industry  

Other Articles