మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ 18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పని చేయబోతున్నాడు. ఏంటనుకుంటున్నారా? తన గొంతు సవరించి ఓ పాట పాడబోతున్నాడండీ. దంగల్ కోసం అమీర్ ఈ ఫీట్ చేశాడంట. చాలా సర్ ప్రైజ్ చివరి నిమిషం దాకా దీనిని సీక్రెట్ గా ఉంచారు లేండి.
18 ఏళ్ల క్రితం గులామ్ సినిమా కోసం ‘‘ఆతి క్యా ఖండాలా’’ అంటూ అమీర్ పాడిన పాట ఏ స్థాయిలో హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఇప్పుడు దంగల్ కోసం మరోసారి పాట పాడాడంట. ‘దాఖద్’ అంటూ సాగే ఈ సాంగ్ లో 51 ఏళ్ల అమీర్ ర్యాపర్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. చాలా సీక్రెట్ గా ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ పూర్తికాగా, ఇటీవలె నిర్వహించిన లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల కార్యక్రమంలో అల్రెడీ ప్రదర్శించారంట కూడా.
అమ్మాయిల దమ్ము గురించి చెబుతూ సాగే ఈ పాటలో చిత్రంలో తన కూతుళ్లుగా నటించిన ఫాతిమా, సన్యలతో అమీర్ చిందులేయనున్నాడంట. డిసెంబర్ 18న జీటీవీలో ప్రసారం అయ్యే ఈ అవార్డుల పంక్షన్ టెలికాస్ట్ లో ఆ పాటను చూసేయొచ్చు. ఈ కార్యక్రమానికి షారూఖ్, కరణ్ జోహర్ లతోపాటు యువహీరో అర్జున్ కపూర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more