భళ్లాలదేవుడు ఎలా మారిపోయాడో చూడండి | Rana Ghazi poster out.

Rana look from ghazi out

Rana Daggubati, Ghazi Movie Poster, Rana look from Ghazi, Ballaladeva to Navy Officer, Rana Ghazi attack, The Ghazi Attack, Ghazi incident, PNS Ghazi Movie, PVP matinee movie Ghazi

Rana Daggubati Ghazi look released.

ఘాజీ కోసం రానా ఎంతగా తగ్గాడంటే...

Posted: 12/13/2016 03:04 PM IST
Rana look from ghazi out

బాహుబలి అనే భారీ ప్రాజెక్టు కోసం హ్యాండ్సమ్ హంక్ లు ప్రభాస్, రానాలు తీసుకున్న కమిట్ మెంట్ ఎంత కష్టమో మనకు తెలిసిందే. గంటల తరబడి వర్కవుట్ లు, భారీ దేహాలు, అవుట్ డోర్ షూటింగ్ కష్టాలు ఇలా అన్నీ చూశాం. రానా అయినా అడపా దడపా వేరే సినిమాల్లో కనిపించినా ప్రభాస్ మాత్రం పూర్తిగా దానికే అంకితమైపోయాడు. ఇప్పటికే రానా దగ్గుబాటి కి బాహుబలి కంక్లూజన్ నుంచి చాలా రోజుల క్రితమే విరామం ఇచ్చేశాడు దర్శకుడు జక్కన్న. ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభాస్ బాహుబలి షూటింగ్ కు గుడ్ బై చెప్పనున్నాడు.

ఇక అల్రెడీ బయటికి వచ్చేయటంతో రానా కొత్త సినిమా కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే కాస్త స్లిమ్ అవతార్ లోకి మారిపోయిన ఈ సిక్స్ ఫీట్ హీరో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఘాజీ మీద కాంసంట్రేషన్ చేశాడు. ఏక కాలంలో హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ బైలింగువల్ చిత్రం ఇప్పటికే సగం షూటింగ్ కూడ జరిపేసుకుందంట. రీసెంట్ గా ఈ చిత్రంలో రానా లుక్ కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రానా నావల్ ఆఫీసర్ గా నటిస్తుండగా, సినిమా ఎక్కువ పార్ట్ నీళ్లలోనే చిత్రీకరించటం విశేషం.

పీవీపీ మరియు మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ లిబరేషన్ పోరాటం సందర్భంగా మిస్టరీగా మునిగిపోయిన పాక్ సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ కి సంబంధించిన ఘటనలతోనే ఈ చిత్రాన్ని రూపొందించారంట. తాప్సీ ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ బాలీవుడ్ లో ఈ చిత్రాన్నిరిలీజ్ చేయబోతున్నాడు. ఫిబ్రవరి 17 న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Ghazi movie look  

Other Articles

Today on Telugu Wishesh