కిస్సు, కథ మొత్తం కాపీయే | Ok Jaanu first look also copied from Original.

Ok jaanu first look released

Ok Jaanu first look, Aditya Roy Kapoor Shraddha Kapoor, OK Kanmani remake, Ok Jaanu release date, Ok kanmani bollywood remake, Ok Kanmani kiss, Shaad Ali Ok Jaanu

Karan Johar released Ok Jaanu first look poster.

హిట్ మూవీ హిందీ రీమేక్ వచ్చేస్తోంది

Posted: 12/09/2016 05:45 PM IST
Ok jaanu first look released

ఏమా కిస్సు? ఏమిటా సినిమా? అనుకుంటున్నారా?. మణిరత్నం దర్శకత్వంలో గతేడాది అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో వచ్చి హిట్టయిన ఓకే కన్మణి(ఓకే బంగారం) గుర్తుందా? ఆ సినిమాను ఇప్పుడు హిందీలో దించేస్తున్నారు అదేనండీ రీమేక్ చేస్తున్నారు. సైలెంట్ షూటింగ్ జరిపేసుకున్న ‘ఓకే జానూ’ చిత్ర ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు.

ఓ యువతి యువకుడు పెళ్లి కాకముందే లింగ్ రిలేషన్ మెయింటెన్ చేయటం, ఆపై నాటకీయ పరిణామాలతో విడిపోవాలనుకోవటం, చివరికి ఒకటి కావటం అన్న కథాంశమే ఈ చిత్రం. తమిళ్ లో సల్మాన్ దుల్కర్, నిత్యామీనన్ జంటగా నటించగా, ఇప్పుడు హిందీలో ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను దర్శకుడు కరణ్ జోహర్ రిలీజ్ చేశాడు. ఒరిజినల్ లో ఏదైతే ఫస్ట్ లుక్ గా రిలీజ్ అయ్యిందో, అదే లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయటం విశేషం.

చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కరణ్ లుక్ సూపర్ గా ఉందని పొగిడితే, పోస్టర్ క్యూట్ గా ఉందంటూ నటి అలియా భట్ ట్వీట్ చేసింది. షాద్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కరణ్, మణిరత్నం నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం. జనవరి 13న ఓకే జానూ విడుదల కానుంది.

 

 

Ok Kanmani kiss poster

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ok Kanmani Remake  Ok Jaanu first look  

Other Articles