రాజమౌళిలా దమ్ము లేదన్న క్రేజీ దర్శకుడు | I don't have guts like Rajamouli Gautham Menon says

I never risked like rajamouli

Gautham Menon, SS Rajamouli, Gautham Menon and Rajamouli, Gautham Menon confessed same subject

Gautham Menon praised Rajamouli, says he never prefered Fantasy and high budget films like Jakkanna.

రాజమౌళా? అంత సీన్ లేదంటున్నాడు

Posted: 11/24/2016 05:16 PM IST
I never risked like rajamouli

ఓటమెరుగుని ధీరుడిలా జక్కన్న సినిమాలన్నీ ఒకదానిని మించి మరోకటి బ్లాక్ బస్టర్ గా మారిపోతున్నాయి. టాలీవుడ్ లో వంద కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే స్థాయికి నిర్మాతలు చేరారంటే అందులో రాజమౌళే ముమ్మాటికీ కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది రాజమౌళిలా సినిమాలు తీయటం తన వల్ల కాదంటున్నాడు మరో స్టార్ డైరక్టర్ గౌతమ్ మీనన్.

బాహుబలిలా మీరు బిగ్ ప్రాజెక్టులు తీయొచ్చు కదా అన్న ప్రశ్నకు గౌతమ్ ఈ సమాధానం ఇచ్చాడు. ‘‘నేను రియలిస్టిక్ సినిమాలు తీసేందుకు యత్నిస్తుంటాను. ప్రేమ కథలు, యాక్షన్ సబ్జెక్టులు మాత్రమే నాకు నప్పుతాయి. రాజమౌళిలా ఫాంటసీ చిత్రాలు తీయటం నా వల్ల కాదు. అంత బడ్జెట్ అంటే కూడా నాకు భయం. కానీ, అలాంటి చిత్రాలు ఎవరైనా తీస్తే మాత్రం చూసి ఎంజాయ్ చేస్తుంటాను అని చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో తాను చేసే చిత్రాలు అన్నీ ఓకే ధోరణిలో ఉంటాయన్న వాదనను మీనన్ అంగీకరించాడు. ముందు నాలుగైదు పేజీల స్క్రిప్ట్ రాసుకున్నాక నాకు నచ్చితేనే, దానిని నా లాప్ టాప్ లో ఎక్కించుకుంటాను. అప్పుడే అది పూర్తి స్తాయి కథగా మారుతుంది. అంతేగానీ, పేజీల పేజీల స్క్రిప్ట్ రాసుకోవటం నాకు సుతరాము ఇష్టం ఉండదని చెప్పుకోచ్చాడు ఈ క్లాసిక్ డైరక్టర్. ప్రస్తుతం ధనుష్ హీరోగా ఎనై నోకి పాయుమ్ తోట అనే సినిమాను డైరక్ట్ చేస్తున్నాడు. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రానా దగ్గుబాటి విలన్. ఇంకోవైపు సూర్యతో మొదలుపెట్టి ఆగిపోయిన ధ్రువనక్షత్రం ప్రాజెక్టును కూడా విక్రమ్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడని టాక్.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautham Menon  SS Rajamouli  

Other Articles