పవన్ సినిమాలకు పనికి రాడని ఫ్యామిలీ అనుకుందా? | Pawan Cine Guru about his skills

When chiru imitates pawan kalyan

Vizag Satyanand, Vizag Satyanand Pawan Kalyan, pawan Kalyan, Chiru Immitates Pawan Kalyan, Vizag Satyanand About Pawan Kalyan, Chiru imitates Pawan Kalyan, Pawan Acting carrier

Vizag Satyanand about Pawan Kalyan and Chiranjeevi.

పవన్ ను చిరు ఇమిటేట్ చేశాడండీ...

Posted: 11/14/2016 03:30 PM IST
When chiru imitates pawan kalyan

ఇదేదో ఖైదీ నంబర్ 150వ చిత్రం కోసం అనుకుంటే పొరపాటు సుమీ. ఇది పవన్ సినిమాల్లోకి రాకముందు మాట. చెప్పింి ఎవరో కాదండీ స్వయానా పవన్ తో నటనలో ఓనమాలు దిద్దించిన వైజాగ్ సత్యానంద్.  వెల్లడించాడు.

మంచు పల్లకి సినిమాకు పని చేస్తున్న సమయంలో చిరు సత్యానంద్ పరిచయం ఏర్పడిందంట. ఆ సమయంలో కొత్త వాళ్లకు ట్రెయినింగ్ ఇచ్చి నాటకాలు వేయిస్తానని సత్యానంద్ చిరుతో చెప్పాడటం. ఆ  విషయాన్ని గుర్తుంచుకుని తొమ్మిదేళ్ల తర్వాత కళ్యాణ్ ను చిరు సత్యానంద్ చేతిలో పెట్టాడంట. కానీ, కళ్యాణ్ మీద వాళ్ల ఇంట్లో వాళ్లెవ్వరికీ నమ్మకం లేదు. జనాలతో కలవడు.. రిజర్వ్డ్ గా ఉంటాడు కాబట్టి అతను నటనలో సక్సెస్ కాడని అనుకున్నారు. అయితే చిరంజీవి గారికి మాత్రం కొంచెం నమ్మకం ఉండేదంట. ఎందుకంటే ఏదైనా పని చెబితే శ్రద్ధగా చేస్తాడని పవన్ మీద చిరుకు భరోసా ఉండేదంట.

ఇక కళ్యాణ్ ను అప్పగించే సమయంలో చిరంజీవి.. పవన్ లా ఇమిటేట్ చేసి చూపించాడంట. ‘‘‘ఎక్కడికి వెళ్లొచ్చావ్’ అని అడిగితే.. ఎలా తల గోక్కుంటాడో.. ఎలా తల వంచుకుని కళ్ల్లల్లోకి చూడకుండా మాట్లాడతాడో అచ్చం చిరు అలా ఇమిటేట్ చేసి మరీ చూపించాడు. ముందు చెన్నైలో నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చాను. తర్వాత గ్రూప్ ట్రైనింగ్ అవసరమని వైజాగ్ తీసుకెళ్తానని చెబితే.. మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండని చిరు చెప్పారు. వైజాగ్ లో రెండు నెలల పాటు నా థియేటర్ గ్రూప్ వాళ్లతో కలిసి ట్రైనింగ్ ఇచ్చాను. అక్కడ కళ్యాణే నా తొలి విద్యార్థి. అతడి కోసమే 40 చాప్టర్ల సిలబస్ తయారు చేశాను. 3 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చాను. అంతా బాగా జరిగింది, ఆపై పవన్ ఈ స్థాయికి చేరుకున్నాడని ’’ అని సత్యానంద్ ఓ ఇంటర్వ్యూలో విషయాలన్నీ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Chiranjeevi  Imitation  Vizag Satyanand  

Other Articles