బాహుబలి ఐటీ రైడ్లలో ఎంత సొమ్ము పట్టుకెళ్లాడో చెప్పేశాడు | Baahubali 2 not affected by IT raid

It raids not effects on baahubali 2

Baahubali-2 IT raids, Vijayendra Prasad, Vijayendra Prasad IT raids, Baahubali IT raids, KV Vijayendra Prasad

Senior Writer Vijayendra Prasad gives Clarity on Baahubali-2 IT raids.

బాహుబలి ఐటీ రైడ్ తో ఒరిగిందేం లేదంట!

Posted: 11/14/2016 03:10 PM IST
It raids not effects on baahubali 2

ఓవైపు నోట్ల వ్యవహారంపై దేశం అంతా ఉలిక్కి పడుతుంటే ఇదే అదనుగా భావించిన ఐటీ శాఖ సినీ రంగంపై దృష్టిసారించింది. కోట్లకు కోట్లు బిజినెస్ చేస్తున్న నిర్మాతలపై కన్నేసి ఉన్న అదికారులు రంగంలోకి దిగేశారు కూడా. ఫస్ట్ టార్గెట్ గా బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా నిర్మాణ భాగస్వాములైన  శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఇళ్లు, ఆఫీసులపై శుక్రవారం దాడులు నిర్వహించింది. అయితే విషయాలు గోప్యంగా ఉండటంతో ఎవరికీ తోచిన లెక్కల్లో వారు సొమ్ము సీజ్ అయ్యిందంటూ వార్తలు రాసేశారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటి?

దీనిపై సీనియర్ కథారచయిత, రాజమౌళి తండ్రి కే.వి. విజయేంద్రప్రసాద్ ఓపెన్ అయ్యాడు. అవన్నీ పుకార్లేనని, ఐటీ దాడులతో బాహుబలికి వచ్చిన నష్టం ఏం లేదని ఆయన ప్రకటించాడు. అంతెందుకు ఓవైపు సోదాలు జరుపుతున్న సమయంలో కూడా వారు షూటింగ్ చేస్తూనే ఉన్నారంట. ప్రస్తుతం సినిమాకు సంబంధించి డబ్బును చెక్కుల రూపంలోనే పంపిణీ చేస్తున్నాం, నగదు రూపంలో కాదు. ఆర్థిక సంబంధిత లావాదేవీల గురించి నేను కూడా మాట్లాడగలుగుతున్నానంటే ఎంత పారదర్శకంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. హఠాత్తుగా ఈ నిర్ణయంతో దేశంతోపాటు నేను షాకయ్యాను. కానీ, జాతిప్రయోజనం కోసం భరించాల్సిందేనంటూ తెలిపాడు.

ఇక డిసెంబర్ చివరికల్లా షూటింగ్ మొత్తం ఫూర్తయిపోతుందని తెలిపిన ఆయన, స్క్రిప్ట్ లో చిన్నచిన్న మార్పులు తప్పంచి, కథను కదిలించలేదని తెలిపాడు. అదే సమయంలో అందరి అంచనాలను బాహుబలి -2 అందుకుంటుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశాడు. మూడో భాగం ప్రస్తావన రాగా, ఇది కథానునసారం రెండు పార్ట్ లుగా చేయాలని అనుకున్నాం. చేసేశాం. మూడోది చేయటం తర్వాతి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KV Vijayendra Prasad  Baahubali IT raids  

Other Articles