తాగటానికి టైం సరిపోవటం లేదంటున్న రష్మీ ! | Rashmi Gautam on drunk and arrest rumour

Rashmi gautam about her drunk and arrest

Anchor Rashmi Gautam, Anchor Rashmi, Rashmi Arrest, Anchor Rashmi Gautam Drunk, Anchor Rashmi drunk and arrest, Rashmi Gautam on drunk and arrest, Rashmi abou Personal Life, Rashmi Pub, Telugu anchor arrest

Popular Telugu Anchor Rashmi Gautham not arrested after drunk

నన్ను అరెస్ట్ చేయలేదంటున్న రష్మీ

Posted: 11/14/2016 01:49 PM IST
Rashmi gautam about her drunk and arrest

చిన్న ముక్క దొరికితే చాలూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే సంస్కృతి మన మీడియాది. అలాంటిది ఓ గాసిప్.. పైగా స్టార్ సెలబ్రిటీపై దొరికితే వదలుతుందా? రీసెంట్ గా ఓ తెలుగు హాట్ యాంకర్ పై నిజనిజాలు తెలీకుండానే రెచ్చిపోయి మరీ కథనాలు రాసేశాయి కొన్ని సైట్లు.

తెలుగులో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన రష్మీ గౌతమ్ ఈ మధ్య సినిమాలతో ఆ క్రేజ్ ను పొగొట్టుకుంటుంది. బుల్లితెరపై ఫ్యామిలీస్ ఆదరణ పొందుతున్న రష్మీ, వెండితెరకు వచ్చే సరికి రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ చేస్తుండటంతో జనాలు ఆటోమేటిక్ గా ఛీ కొట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా  తాగి ఓ పబ్ లో రచ్చ చేసిందని, అంతటితో ఆగకుండా రోడ్డు మీదకు చేరి అందరికీ ఇబ్బంది కలిగించిందని, ఆపై పోలీసులు రంగం ప్రవేశం చేసినా శివతాండవం చేసి వారినీ ముప్పు తిప్పలు పెట్టిందని, చివరకు అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లి, ఆపై కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారన్నది ఆ వార్త కథనం.

అయితే తనపై వస్తున్న వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదు అంటోంది రష్మీ. దాంట్లో వాస్తవం లేనప్పుడు నేనేందుకు స్పందించాలి. నా వాళ్లకు నా గురించి తెలుసు. అయినా అలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అయినా నాకు అసలు తాగేందుకు, తిరిగేందుకు టైం ఉంటుందా చెప్పండి?!! అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautam  Drunk and Arrest  fake  

Other Articles