అందాల అమ్మడు మన్నించమని కోరింది sanjana says apology to film producers

Sanjana says apology to film producers

Heroine Sanjana, Kannada Film Producers, complaint, karnataka film producers council, sandal wood, TV intervies, TV reality show, apology

sandalwood heroine sanjana says apology to producers on her remarks on producers business mind after they complain in film producers council.

అందాల అమ్మడు మన్నించమని కోరింది

Posted: 10/09/2016 05:28 PM IST
Sanjana says apology to film producers

అందాల అమ్మడు అపాలజీ చెప్పేసింది. అదేంటి అంటారా.. అచ్చ తెలుగులో చెప్పాలంటే తనను మన్నించమని కోరింది. ఇంతకీ అంతవరకు పరిస్థితి ఎందుకు వచ్చిందంటరా.. అందం, అభినయం వున్న చోటు నోటి దురుసు వుండకూడదు, అన్న విషయం అమ్మడికి తెలియక కాబోలు తన మనస్సులో ఎవరో ఒక వ్యక్తిపై ఎదో పెట్టుకుని దానిని మొత్తం చిత్ర పరిశ్రమకు అపాదించే ప్రయత్నం చేయడం వల్ల అమ్మడికి ఈ పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటారా..? కన్నడ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటి సంజన

కన్నడ చిత్రాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ అమెపై కన్నడ చిత్ర నిర్మాతలకు కొందరు కర్ణాటక చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. టీవీషోలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్న విషయంపై  నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటి సంజనా... దర్శకనిర్మాతలు డబ్బా సినిమాలను తీసి వాటిని ప్రజలపై రుద్దుతుండడం వల్లే టీవీల్లో ప్రసారమయ్యే రియాలిటీషోలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదంటూ    ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై స్పందించిన నటి సంజనా ..టీశీ వెంకటేశ్ తనను ఏకవచనంతో సంభోధిస్తూ తనపై చేసిన వ్యాఖ్యల దృష్ట్యా  అలా మాట్లాడానన్నారు.  తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతూ తన ఫేస్‌బుక్‌లో వీడియో విడుదల చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heroine Sanjana  Kannada Film Producers  complaint  apology  

Other Articles