బాహుబలి-2 కోసం రానా భయానక అవతారం | rana tweeted his menance pic as Bhallaladeva

Rana tweeted his menance pic as bhallaladeva

Rana tweeted his menance pic as Bhallaladeva, ferocious Bhallaladeva, Rana tweeted his menance pic, Rana in Gym, Rana with Trainer, Rana tweeted his menance pic, rana kunal gir, Gym Trainer Kunal Gir

ferocious Rana tweeted his menance pic as Bhallaladeva.

భళ్లాలదేవుడి శకం ముగిశాక కూడా ఇలా...

Posted: 10/04/2016 01:36 PM IST
Rana tweeted his menance pic as bhallaladeva

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటంతో బాహుబలి సెకండ్ ఫార్ట్ పై ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో వాటిని అందుకునే రేంజ్ లో ఉండాలంటే మొదటి దానికంటే చాలా కష్టపడాలని నిర్ణయించుకున్న రాజమౌళి తన టీం సభ్యులను అలాగే ప్రిపేర్ చేశాడు కూడా. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కావటంతో భల్లాలదేవుడికి అదేనండీ మన రానాకు విముక్తి కలిగించేశాడు. ఇదే సమయంలో అనుమానాలను నివృత్తి చేసేందుకు మీడియా సమావేశం పెట్టి మరీ ముఖ్య తేదీలను ప్రకటించేశాడు కూడా.

తాజాగా రానా భయానక రూపం ఒకటి నెట్ లో దర్శనమిస్తోంది. భల్లాలదేవుడి అవతారం కోసం తొలుత 93 కేజీలకు చేరుకున్న రానా ఇప్పుడు పార్ట్ 2 కోసం వయసుపై బడిన పాత్రలో కనిపించేందుకు కూడా ఏకంగా 110 కిలోకు బరువు పెరిగాడు. ట్రయినర్ కునాల్ గిర్ సమక్షంలో భీభత్సమైన రూపానికి మారిపోయిన భల్లాలదేవుడు కండలను చూపిస్తూ ఉన్న ఫోటోను మిర్రర్ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. మరింత క్రూరంగా కనిపించాలని రాజమౌళి కోరిక మేరకు రోజుకు రెండున్నర గంటలు ఇలా తన ఒళ్లును హునం చేసుకుని రానా మారిపోయాడంట. అయితే క్లైమాక్స్ పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పిన రాజమౌళి, రానా పోర్షన్ పూర్తి ఎలా చేశాడన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.

ఏది ఏమైనా ప్రస్తుతం తనకు విముక్తి కలగటంతో రానా మాత్రం ఇలా ట్వీట్లు చేసుకుంటూ తన తదుపరి చిత్రం కోసం మాములుగా మారిపోయేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అన్నట్లు ప్రమోషన్ లో భాగంగానే ఈ ఫోటోను వాడుతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చాడు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Bhallaladeva  Baahubali-2  Gym Pic  Ferocious  

Other Articles