అభిమానుల సమక్షంలో జనతా గ్యారేజ్ విజయోత్సవం | janatha garage success celebrations with fans

Janatha garage success celebrations with fans

NTR Janatha Garage success meet, NTR Janatha Garage celebrations, NTR Janatha Garage fans, NTR celebrates garage success with fans

NTR janatha garage success celebrations with fans.

జనతా గ్యారేజ్ విజయోత్సవం

Posted: 09/13/2016 10:45 AM IST
Janatha garage success celebrations with fans

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జనతా గ్యారేజ్'కి, అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. విడుదలై రెండు వారాలు పూర్తికావస్తున్నా ఇప్పటికీ అన్ని ఏరియాలో హవా కొనసాగుతూనే ఉంది. 11 రోజుల్లో 70 కోట్లతో ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. మొన్నీమధ్యే టీంతో థాంక్స్ మీట్ నిర్వహించిన ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమైపోతున్నాడు.

నిజానికి 10వ తేదీనే వైజాగ్ లో దీనిని నిర్వహించాలని చూసినప్పటికీ నిమజ్జనం ఉండటంతో దానిని వాయిదా వేశారు. కేవలం చిత్ర యూనిట్ సభ్యులు ఓ హోటల్ లో పార్టీ నిర్వహించుకున్నారు. మరి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు .. అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయకపోతే ఎలా అనుకున్న ఎన్టీఆర్ ఈ సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఈ రోజున సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జే ఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ హీరోయిన్లు సమంతా, నిత్యామీనన్ తో పాటు టీమ్ లోని ఇతర సభ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ విజయోత్సవ వేడుకకి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Janatha Garage  success celebrations  Hyderabad  

Other Articles