బాహుబలిలో అనుష్కకి వారికి ఫైట్లు | anushka actions scenes for Baahubali 2

Anushka actions scenes for baahubali 2

Anushka actions scenes Baahubali 2, Baahubali 2 wars, Anushka war scenes for baahubali 2, Anushka fight with Baahubali, Anushka Fight with Ballaladeva, Devasena action scenes

Anushka actions scenes key for Baahubali 2.

బాహుబలి 2 కోసం ఊహించని ట్విస్ట్ లు

Posted: 09/13/2016 11:20 AM IST
Anushka actions scenes for baahubali 2

బాహుబలి ది బిగినింగ్ తో దేశం చూపు తనవైపు తిప్పుకున్న జక్కన్న పార్ట్ 2 తో వండర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమైపోయాడు. విడుదలకు ఎనిమిది నెలల ముందుగానే దేశంలో ఏ సినిమా కూడా చేయని రేంజ్ లో ప్రీ బిజినెస్ జరుపుకుంటున్న ఈ కళాఖండంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికీ ఊహించని రీతిలో ట్విస్ట్ లు ఇచ్చేందుకు దర్శకధీరుడు సిద్ధమైపోతున్నాడు.

మొదటి పార్ట్ లో భీకర యుద్ధంతో క్లైమాక్స్ ముగించిన రాజన్న రెండో పార్ట్ కోసం ఏకంగా రెండు యుద్ధాలను పెట్టబోతున్నాడంట. ఈ రెండు యుద్ధాల్లో కీలకపాత్ర పోషించేంది హీరోయిన్ అనుష్కే అన్న సమాచారం ఇప్పుడు బయటికి పొక్కుతోంది. మొదటి పార్ట్ లో కేవలం రెండు, మూడు సీన్లకే పరిమితమైన స్వీటీతో రెండో పార్ట్ లో విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైపోతున్నాడంట.

ఇక కంక్లూజన్ లో ప్రభాస్, రానాలతో కూడా అనుష్క ఫైటింగ్ సీన్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా భల్లాలదేవుడితో తలపడే సీన్ లో ఎమోషన్స్ పీక్స్ లోకి తీసుకెళ్తాయంట. మొత్తానికి మొదటి పార్ట్ లో సంకెళ్లకు పరిమితమైన అనుష్కను రెండో పార్ట్ లో యాక్షన్ మోడ్ లోకి మార్చేయబోతున్నారన్నమాట.    

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Baahubali 2  war scenes  Prabhas  Rana  

Other Articles