మోహన్ బాబు 40 వసంతాల వేడుకలో అరుదైన కలెక్షన్ | Special Attractions in Mohan Babu 40years Celebrations

Special attraction in mohan babu 40years celebrations

Mohan Babu 40years Celebrations, Special Attractions in Mohan Babu celebrations, Mohan Babu 40years CDs, CDs on Mohan Babu Carrier, Collection King CDs collection

Special Attraction in Mohan Babu 40years Celebrations. Released CDs on Mohan Babu Carrier with Songs and Dailogues.

విలక్షణ నటుడి వేడుక కోసం స్పెషల్ అట్రాక్షన్

Posted: 09/12/2016 06:33 PM IST
Special attraction in mohan babu 40years celebrations

తెలుగు చిత్రపరిశ్రమలో తన ఢిఫరెంట్ డైలాగ్ డెలివరీతో విలక్షణమైన నటుడిగానే కాదు, నిర్మాతగా సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి ప్రత్యేకమైన స్థానం వుంది. చిత్రపరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబసభ్యులు .. అభిమానులు కలిసి, సెప్టెంబర్ 17వ తేదీన వైజాగ్ లో ఒక భారీ వేడుకను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు చిత్రపరిశ్రమలోనే ఇది ఘనమైన వేడుకగా నిలిచిపోతుందని అంటున్నారు. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర చిత్రపరిశ్రమలకి సంబంధించిన ప్రముఖులంతా ఈ వేడుకకి ఆహ్వానం అందించారు. మంచు విష్ణు, మంచు మనోజ్ తనయులిద్దరూ ఇద్దరూ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. ఈ సందర్భంలో .. మోహన్ బాబు నటించిన హిట్ చిత్రాలలోని 60 పాటలను కలుపుకుని ఒక సీడీని రిలీజ్ చేయనున్నారు.

మోహన్ బాబు కెరియర్లో కలికితురాయిగా నిలిచిపోయిన 'పెదరాయుడు' సినిమాలోని హైలైట్ సీన్స్ తో కూడిన ఒక సీడీని విడుదల చేయనున్నారు. అలాగే మోహన్ బాబు అంచలంచెలుగా ఎదిగిన తీరును తెలిపే, పర్సనల్ ఫోటోలతో కూడిన ప్రత్యేకమైన ఆల్బమ్ ను రిలీజ్ చేయనున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలంతా హాజరయ్యే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  CDs  40 years celebrations  

Other Articles