అమలాపాల్ భర్తతో విభేదాలు ఎందుకంటే... | reason behind amala paul vijay break up

Reason behind amala paul vijay break up

amala paul divorce, amala paul husband, amala vijay divorce, amala paul good bye to movies, amala bye to films

Reason behind amala paul vijay break up. Vijay parents object amala paul not to doing films.

అమలపాల్ అసలు సమస్య ఏంటి?

Posted: 07/30/2016 01:31 PM IST
Reason behind amala paul vijay break up

నటి అమలాపాల్ వైవాహిక జీవితం తెగదెంపులు చేసుకునే దాకా వచ్చిందన్న వార్తలు గత కొద్దిరోజులుగా సౌత్ సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నారు. దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్న అమల పెళ్లి తర్వాత నటన కొనసాగించేందుకు భర్త ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటంతో ఆమె కంటిన్యూ చేస్తూ వస్తోంది. అయితే తమ కొడలు సినిమాలో నటించడం ఇష్టం లేదని విజయ్ తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పటంతోనే అసలు గొడవ మొదలైందని అంటున్నారు.

ఆమె నటించడానికి వీల్లేదని అంటోన్న తల్లిదండ్రులకు అతను సర్దిచెప్పకపోవడమే పరిస్థితి ఇంత దూరం రావడానికి కారణమని చెప్పుకుంటున్నారు. వడచెన్నై సినిమాకి సమంత తప్పుకున్న ధనుష్ సరసన నటించేందుకు అమల ఎంట్రీ ఇవ్వటం దగ్గరి నుంచి మొదలైన ఈ వార్తలు, తాజాగా విజయ్ తల్లిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెన్ గా చెప్పటంతో మరింత వేడెక్కాయి. ముందు నటించేందుకు ఒప్పుకున్న భర్త, తల్లిదండ్రుల చేతిలో కీ బొమ్మగా మారి తనకు అడ్డుచెప్పటం ఏమాత్రం సహించని అమలా, ఎట్టి పరిస్థితుల్లో అతనితో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని మొండిపట్టుతో ఉందట.

ఈ విషయంలో పలువురు సెలబ్రిటీలు కూడా భిన్న అభిప్రాయాలు చెబుతుండటం విశేషం. అత్త మామలకు .. భర్తకు ఇష్టం లేనప్పుడు అమలా పాల్ నటించడం మానేస్తే బాగుండేదని కొంతమంది అంటున్నారు. పెళ్లికి ముందు అంగీకరించిన సినిమాలనే ఆమె చేస్తోందని, అవి కూడా గ్లామర్ ప్రాధాన్యత లేనివేనని మరికొంతమంది చెబుతున్నారు. ఏదేమైనా బాగా ముదిరిన ఈ వ్యవహారంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకోవటం ఖాయమనే కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  AL Vijay  break up  divorce  

Other Articles

Today on Telugu Wishesh