చిరు 150లో కాజల్ ఫిక్స్ | Kajal signed for chiru 150th movie.

Kajal signed for chiranjeevi 150th movie

Kajal chirajeevi, chiru kajal romance, kajal mega chance, Kajal about chiru, kajal about 150 movie, kajal chiru movie, kajal in chiru movie

kajal signed for chiranjeevi 150th movie.

అఫీషియల్: చిరు 150లో చందమామేనంట!

Posted: 07/30/2016 11:28 AM IST
Kajal signed for chiranjeevi 150th movie

మెగాస్టార్ 150వ చిత్రంపై నెలకొన్న ఒక సస్పెన్స్ విషయంలో సందేహాలు తొలగిపోయాయి. హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేశారని ఒకసారి, ఆపై ఆమె కాదని మరోసారి, ఇలా వార్తలు వచ్చిన సంగతి విదితమే. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఇస్తున్న సమాచారం ఏంటంటే... ఈ సినిమాలో హీరోయిన్ కాజలేనని.

నిజానికి విక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్టు గరుడ లో కాజల్ నటించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం విక్రమ్ ఇరుమురుగన్ (ఇంకోక్కడు) షూటింగ్ ఆలస్యం అవుతుండటం, చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేకపోవటంతో కాజల్ చిరు సినిమాను అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి భారీ రెమ్యునరేషన్ తో ఆమె చిత్రానికి సైన్ కూడా చేసిందని అంటున్నారు. ఆగష్టు మధ్యలో ఆమె షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందట. చిరు ఇంట్రడక్షన్, కొన్ని యాక్షన్ సీన్లతోపాటు, రైతులపై వచ్చే సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేయగా, ఇంకా మిగిలింది పాటలు, హీరోయిన్ తో సన్నివేశాలు మాత్రమే.

కాజల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ హిట్లయ్యాయి. ఇప్పుడు చెర్రీ రికమండేషన్ తోనే ఆమె ఈ మెగా ఛాన్స్ కొట్టేసిందన్నది తెలిసిందే. అయితే తనయుడితో, తాజాగా తమ్ముడితో యాక్ట్ చేసి, ఇప్పుడు తండ్రితో రొమాన్స్ చేస్తే ప్రేక్షకుడు జీర్ణించుకోగలడా అన్నదే సందేహంగా మారింది. ఈ విషయంలో దర్శకుడు వినాయక్ ఏమేర మార్పులు చేస్తాడా? లేక ఒరిజినల్ వర్షన్ లో పెట్టినట్లుగానే ఉంచుతాడా? చూడాలి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 movie  kajal agarwal  vinayak  kaththi remake  

Other Articles