చిరు 150లో మెగా అభిమానులు | Ram charan bumper offer to mega fans

Ram charan bumper offer to mega fans

Ram Charan offer for chiru 150, Mega fans at 150 sets, Katthilantodu nega fans

Ram Charan bumper offer to mega fans and a chance to meet Chiru on 150 sets.

చిరును కలిసేందుకు మెగా ఆఫర్

Posted: 07/15/2016 09:58 AM IST
Ram charan bumper offer to mega fans

మెగా అభిమానులకు ఓ శుభవార్త. కత్తిలాంటాడో సినిమా కోసం ఫ్యాన్స్ కి ఆహ్వానం అందింది. గురువారం సాయంత్రం తన అభిమానులతో తొలిసారిగా ఫేస్ బుక్ ద్వారా లైవ్ ఛాట్ చేసిన సందర్భంగా రామ్ చరణ్ ఓ 'మెగా' ఆఫర్ ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవితో 150 సినిమా సెట్లో సందడి చేసే అవకాశం కల్పిస్తున్నాడు. అయితే దానికి కండిషన్స్ అప్లై అంటున్నాడు.

అభిమానులు ఎవరైతే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో వారిని ఎంపిక చేసి ఈ అవకాశం కల్పిస్తారంట. తమ తమ ప్రాంతాలలో అభిమానులు నిర్వహించే సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను చరణ్ ఫేస్ బుక్ అకౌంటులో పోస్ట్ చేయాలి. అలా వచ్చిన వాటిలో బెస్ట్ ను ఎంపిక చేసి చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం సెట్స్ కు వారిని ఆహ్వానిస్తారు. అలాగే, వారికి సత్కారం కూడా చేస్తామని చెర్రీ చెబుతున్నాడు.

ఇక ఈ ఫేస్ టూ ఫేస్ లోనే ఇంకో షాకింగ్ విషయం అనౌన్స్ చేశాడు చెర్రీ. అంతా అనుకుంటున్నట్లు ఈ సినిమా టైటిల్ కత్తిలాంటోడు కాదని, త్వరలో అఫిషీయల్ టైటిల్ అనౌన్స్ చేస్తామని ప్రకటించాడు. అన్నట్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అభిమానులకు చిరుతో ముఖాముఖి మాత్రమే కాదు... వారికి 150లో నటింపజేసే అవకాశం కూడా కల్పిస్తానని చెబుతున్నాడు. ఇంకేటిం ఆలస్యం మెగా ఫ్యాన్స్... రంగంలోకి దూకేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Chiranjeevi  150 movie  Katthilantodu  mega fans  

Other Articles