nagarjuna and raghavendrarao movie title fix

Nagarjuna and raghavendrarao movie title fix

nag movie, nagarjuna devotional movie, nagarjun next movie, nagarjuna upcoming movie, nagarjuna raghavendra rao movie, nagarjuna upcoming movie, nag next movie, nagarjuna movies, nagarjuna devotiona, hathiram baba

akkineni nagarjuna and k raghavendrarao combination movie title confirmed by nag. the movie name is namo venkatesaya is finally fixed for this movie

నాగ్ సినిమా టైటిల్ ఫిక్స్...!

Posted: 06/23/2016 12:24 PM IST
Nagarjuna and raghavendrarao movie title fix

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి భక్తిరస చిత్రంలో నటిస్తున్నాడు. మళ్లీ దర్శకేంద్రుడు రాఘంద్రరావు డైరక్షన్ లోనే ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ నిజమేనంటూ నాగార్జున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చిత్రవిశేషాలను మీడియాతో పంచుకున్నాడు.

'ఓం నమో వెంకటేశాయ' పేరును ఖరారు చేశామని నాగార్జున తెలిపారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామి భక్తుడు హథీమ్ రామ్ బాబా పాత్ర పోషించనున్నట్లు వెల్లడించాడు. ఈ నెల 25న సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని నాగ్ చెప్పాడు.

ఈ సినిమాకు జె.కె. భారవి కథ అందిస్తున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన హథీమ్ రామ్ బాబా తిరుమల శ్రీవారికి వీర భక్తుడు. శ్రీనివాసుడిని నిత్యం భక్తిశ్రద్ధలతో కొలిచేందుకు తిరుపతిలో స్థిరపడిపోయాడు. ఇప్పటికి ఆయన సమాధి తిరుపతిలో ఉంది. అలాంటి హధీరామ్ బాబా సినిమాని అంతే భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్నామని చెప్పాడు కింగ్ నాగ్.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  k raghavendrarao  hathiram baba  nagarjuna devotional movie  

Other Articles