రజనీకాంత్ లేకుండానే కబాలి ఆడియో | Kabali Audio Launch Cancelled

Kabali audio launch cancelled

Kabali Audio Launch Cancelled, Kabali Movie Posters, Kabali Trailers, Kabali stills, Kabali diolagues, Kabali movie updates, Kabali movie news, Rajinikanth stills, Rajinikanth movies, Rajinikanth

Kabali Audio Launch Cancelled: Tamil Superstar Rajinikanth upcoming film kabali. Pa.Ranjith director. Kabali movie Telugu state rights had been sold for a record amount

రజనీకాంత్ లేకుండానే కబాలి ఆడియో

Posted: 06/08/2016 09:05 AM IST
Kabali audio launch cancelled

విభిన్న చిత్రాల దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి’. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గతకొద్ది రోజులుగా వాయిదా పడుతూనే వుంది. చివరకు జూన్ 12న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించారు.

అభిమానుల సమక్షంలో ఆడియో చాలా గ్రాండ్ గా జరగబోతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే.. వారి ఆశలపై రజనీకాంత్ నీళ్లు చల్లేసాడు. ప్రస్తుతం రజనీకాంత్ సెలవుల కారణంగా అమెరికాలో వున్నారు. అందువల్ల జూన్ 12న ఆడియో ఫంక్షన్ కు రావడం కుదరదు. దీనివల్ల ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసేసారు. అదే రోజున నేరుగా మార్కెట్లోకి ఆడియో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసి, టాప్ 1 స్థానంలో నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత కలైపులి.ఎస్.థాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాధిక ఆప్టే, ధన్సికలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabali  Rajinikanth  Radhika apte  

Other Articles