Pawan Kalyan | Ram Gopal Varma | Interview | RGV | Sardaar Gabbar Singh

Pawan kalyan talks about rgv tweets

Pawan Kalyan Comments on RGV, Pawan Kalyan talks about RGV, Pawan Kalyan interviews, Pawan Kalyan Sardaar Gabbar Singh, Pawan Kalyan latest interviews, Pawan Kalyan latest updates, Pawan Kalyan latest videos, Pawan Kalyan, Sardaar Gabbar Singh collections, Sardaar Gabbar Singh

Pawan Kalyan talks about RGV tweets: Powerstar Pawan kalyan latest interview about his latest hit film Sardaar Gabbar singh and Political details.

నేను ఓటమి చెందడం ఆయన తట్టుకోలేడు: పవన్ కళ్యాణ్

Posted: 04/11/2016 12:40 PM IST
Pawan kalyan talks about rgv tweets

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గతకొద్ది కాలంగా పలు రకాల ప్రశంసలు, విమర్శలతో తన సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వర్మ చేస్తున్న కామెంట్లపై మరియు అతనితో తనకున్న సన్నిహిత్యాన్ని... అలాగే తన సినిమా వివరాల గురించి పవన్ కళ్యాణ్ ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్పందించాడు.

తనతో సినిమాలు చేయడానికి దర్శకులు లేరట

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఆయన గ్రేట్ ఫిల్మ్ మేకర్. ఆయనపై ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియదు. ఆయన ఆవేశంలో వున్న వ్యక్తి. ఆయనను ఏమి అనలనిపించదు. ఆయన ట్వీట్ల విషయంలో నాకు అర్థమయ్యింది ఏంటంటే.. నేను ఓటమి చెందటం ఆయన తట్టుకోలేడు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయనంటే కూడా నాకు ఇష్టం. అప్పట్లో ఓసారి ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ అనే స్టోరీ చెప్పారు. నాకు నచ్చలేదని నేరుగా చెప్పేసాను. అదేంటి.. మీ తమ్ముడికి చాలా పొగరు.. ఇలా నేరుగా నచ్చలేదని చెప్పేసాడు అని అన్నారు. కానీ ఆ తర్వాత తాను తప్పు అని నిరూపించావనే అంశంతో వర్మకు నామీద మంచి భావన పెరిగింది కావచ్చు అని చెప్పుకొచ్చారు.


Video Source: TV9Telugu Live

అలాగే తెలుగు సినిమాల బడ్జెట్ పెరిగిపోతున్నాయి. మార్కెట్ పరిధి పెంచాలి. తమిళ సినిమాలు తెలుగులోకి, సల్మాన్ ఖాన్ హిందీ చిత్రాలు తెలుగులోకి వస్తాయి. ఇలా మార్కెట్ పరిధి పెంచాలి అని అనుకొనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హిందీలోకి విడుదల చేసాము. నేను మనస్పూర్థిగా చిత్తశుధ్దితో సినిమా చేసాను. ఆ తర్వాత ప్రేక్షకుల ఇష్టం. ఒకవేళ అలా జనాలు రిజెక్ట్ చేసారని భావిస్తే.. నేను ‘జానీ’ తర్వాత బ్రతికుండకూడదు. ఈపాటికే సమాధి కట్టేయాలి. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కు జనాలు కనెక్ట్ అయితే సీక్వెల్ గా ‘రాజా సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం వుంటుంది. తన వ్యక్తిగత, సినిమా, రాజకీయాల విషయాల్లో బిజీగా వుండటం వల్లనే ‘బాహుబలి’ చిత్రాన్ని చూడలేదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పవర్ స్టార్ కు కొడుకు పుట్టినరోజు గుర్తులేదట

ఇక దాసరి నారాయణరావు గారి నిర్మాణంలో సినిమా చేయడానికి సంసిద్దద తెలిపాను. ఇక నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  RGV  Sardaar Gabbar Singh  Interviews  Collections  

Other Articles