Chiranjeevi | Pawan kalyan | Sardaar Gabbar Singh | Shooting Stills

Chiranjeevi in sardaar gabbarsingh shooting set

Chiranjeevi in Sardaar Gabbarsingh set, Chiranjeevi in Sardaar Gabbarsingh shooting, Chiranjeevi at Sardaar Gabbarsingh set, Chiranjeevi meets Sardaar Gabbarsingh, Chiranjeevi with Sardaar Gabbarsingh, Chiranjeevi latest stills, Sardaar Gabbarsingh shooting stills, Sardaar Gabbarsingh stills

Chiranjeevi in Sardaar Gabbarsingh shooting set: Powerstar Pawan kalyan busy in Sardaar Gabbar singh movie shooting. Megastar chiranjeevi enterd into sardaar gabbar singh shooting

ఫోటో టాక్: సర్దార్ ఏరియాలో మెగాస్టార్ హల్చల్

Posted: 01/28/2016 12:14 PM IST
Chiranjeevi in sardaar gabbarsingh shooting set

మెగా ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది, మెగాస్టార్ చిరంజీవికి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారంటూ వచ్చిన చెత్త వార్తలకు సమాధానంగా మెగాస్టార్, పవర్ స్టార్ లు మరోసారి నిరూపించారు. గతంలో మెగా ఫ్యామిలీకి చెందిన ఏ కార్యక్రమంలోనైనా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు హాజరయ్యేవారు. కానీ గతకొద్ది కాలంగా వీరిద్దరూ కలిసి ఏ కార్యక్రమంలో కూడా కనిపించకపోవడంతో... మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ వేరయ్యాడంటూ పుకార్లు వినిపించాయి.

ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ హాజరయ్యి, స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అలాగే ఇటీవలే ‘బ్రూస్ లీ’ సినిమాలో గెస్ట్ పాత్రలో నటించిన చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అందరికి అర్థమయ్యేలా క్లియర్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడు. ఫ్యామిలీ పరంగా మేమంతా ఒక్కటే.. మా విధి, విధానాలు వేరవ్వచ్చు.. కానీ మా గమ్యం ఒక్కటే. మేమంతా కలిసే వున్నాం అంటూ ఓ క్లారిటీ ఇచ్చేసాడు. పవన్ కళ్యాణ్ స్టేట్ మెంట్ ఇచ్చినా కూడా కొంతమంది పనిగట్టుకొని మరీ... వీరిద్దరూ విడిపోయారంటూ ప్రచారం సాగిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ అన్నదమ్ములు ఇద్దరూ కూడా సత్సంబంధాలతో కలిసే వున్నారనే విధంగా తాజాగా ఓ సంఘటన జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి అక్కడికి విచ్చేసి, చిత్ర యూనిట్ ను కలిసి ముచ్చటించారు. మీరు చూస్తున్న ఫోటో ఆ సంధర్భంలో తీసినదే. ఈ ఒక్క ఫోటో సరిపోదా.. వారిద్దరూ ఇంకా కలిసే వున్నారని, వారిద్దరి మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదు అని చెప్పడానికి.


Telugu Filmnagar

ఒకవేళ నిజంగా వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి వుంటే... తమ్ముడి సినిమా షూటింగ్ స్పాట్ కు తానేందుకు వెళ్లాలి అని చిరంజీవి అనుకునేవాడు... కానీ అలా జరగలేదు. తమ్ముడు అనే అనుబంధం వుంది కాబట్టే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ స్పాట్ కు వెళ్లి కలిసొచ్చాడు. చిరంజీవి రాకకు పవన్ కళ్యాణ్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసారు. ఇక సీన్ కట్ చేస్తే... ఈ సంఘటన వలన త్వరలోనే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో భారీ సంచలనం జరుగబోతునట్లుగా తెలుస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్ర ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్ లు విచ్చేసారు. కానీ ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు చిరంజీవి, నాగబాబు, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు శిరీష్, అల్లు అరవింద్, నిహారిక....ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం కూడా హాజరుకాబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుక భారీ బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం ఖాయం... మెగా అభిమానులకు వంద పండగలు ఒకేసారి వచ్చినట్లే అవుతుంది. మరి ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

బాబీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను మార్చి 12న గ్రాండ్ గా, అభిమానుల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన టీజర్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

Chiranjeevi-at-Sardaar-Gabbar-Singh-Sets-01
Chiranjeevi-at-Sardaar-Gabbar-Singh-Sets-02
Chiranjeevi-at-Sardaar-Gabbar-Singh-Sets-03
Chiranjeevi-Pawan-Kalyan
Pawan-Kalyan-Sardaar-Gabbar-Singh-Movie
Sardaar-Gabbar-Singh-Movie-Shooting-Stills

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbarsingh  Chiranjeevi  Pawan kalyan  Shooting stills  

Other Articles