Shraddha Das | Item song | Dictator | Balakrishna

Shraddha das item song in balakrishna dictator film

Shraddha Das Item song in Balakrishna Dictator, Shraddha Das in Dictator, Shraddha Das hot stills, Shraddha Das item songs, Shraddha Das hot videos, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna movies, Balakrishna stills, Anjali, Sonal chauhan

Shraddha Das Item song in Balakrishna Dictator Film: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

ముమైత్ ఖాన్ స్థానంలో శ్రద్ధా.. డిక్టేటర్ తో టింగో టింగో!

Posted: 12/24/2015 03:40 PM IST
Shraddha das item song in balakrishna dictator film

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ చిత్రంలో హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఓ ఐటెం సాంగ్ లో నటించనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐటెం సాంగ్ లో ముమైత్ ఖాన్ నటించడం లేదని తేలిపోయింది. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇందులోని ‘టింగో టింగో...’ అనే పాటలో బాలయ్యతో ముమైత్ ఖాన్ చిందులేయనుందని వార్తలొచ్చాయి. కానీ ఈ పాటలో ముమైత్ ఖాన్ నటించడం లేదు. ఈ ‘టింగో టింగో...’ పాటలో బాలయ్యతో లవ్లీ బ్యూటీ శ్రద్ధాదాస్ చిందులేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా శ్రద్ధాదాస్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

‘డిక్టేటర్’ సినిమాలో బాలకృష్ణతో కలిసి ‘టింగో టింగో..’ పాటలో చిందులేయబోతున్నానని శ్రద్ధాదాస్ పోస్ట్ చేసింది. అంతేకాకుండా తనకు సంబంధించిన ఓ ఫోటోను కూడా పోస్ట్ చేసింది. మరి ఈ అమ్మడు ఈ పాటలో శ్రద్ధాదాస్ గెటప్ ఇలాగే వుంటుందో ఏమో త్వరలోనే తెలియనుంది. మొత్తానికి బాలయ్య పక్కన చిందులేసే అవకాశం శ్రద్ధాదాస్ కొట్టేసింది.

ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహాన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథ-స్క్రీన్ ప్లేని అందించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shraddha Das  Item song  Dictator  Balakrishna  Anjali  sonal chauhan  

Other Articles