Bajrangi Bhaijaan | Dubbing | Sign language

Bajrangi bhaijaan movie will be dubbed into a sign language

Bajrangi Bhaijaan will be dubbed into a sign language, Bajrangi Bhaijaan in sign language, Bajrangi Bhaijaan latest news, Bajrangi Bhaijaan dubbing, Bajrangi Bhaijaan geetha, Bajrangi Bhaijaan latest details, Bajrangi Bhaijaan dubbing updates, Geetha wants Bajrangi Bhaijaan

Bajrangi Bhaijaan movie will be dubbed into a sign language: Bollywood hero salman khan latest block buster hit film Bajrangi Bhaijaan. This film will be dubbed into a sign language.

గీత కోసం మూగ భాషలో ‘భజరంగీ భైజాన్’

Posted: 10/20/2015 12:15 PM IST
Bajrangi bhaijaan movie will be dubbed into a sign language

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ భైజాన్’ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి భారత్ లో తప్పిపోవడంతో.. ఆ అమ్మాయిని తిరిగి సల్మాన్ ఎలా తీసుకెళ్లాడు అనే కథాంశంతో రూపొందింది.

అయితే నిజజీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. పాకిస్థాన్ లో తప్పిపోయిన భారత్ కు చెందిన మూగ-చెవిటి యువతి గీత కోరిక మేరకు ఈ చిత్రాన్ని సైగలతో రూపొందించనున్నారు. ఈ చిత్రం తన జీవితానికి దగ్గరగా వుందని, అందుకే ఈ చిత్రాన్ని మూగ భాషలో డబ్బింగ్ చేస్తే తనలాంటి చాలా మంది చూసి ఆనందిస్తారని గీత కోరినట్లుగా ఇండోర్ లోని మూగ పిల్లల సహాయ కేంద్రం సంరక్షకుడు జ్ఞానేంద్ర పురోహిత్ తెలిపారు.

గీత కోరిక మేరకు తమ సంస్థే ప్రస్తుతం ఈ డబ్బింగ్ పనులు చూస్తుందని ఆయన తెలిపారు. సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగ్రీ భైజాన్’ మరి మూగ భాషలో విడుదలై ఎలాంటి స్పందనను రాబట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bajrangi Bhaijaan  Dubbing  Sign language  Geetha  News  

Other Articles