‘ముకుంద’ తర్వాత వరుణ్ తేజ నటించిన రెండవ చిత్రం ‘కంచె’. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో వరుణ్ సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యం లో సాగే ఒక ప్రేమ కథ ఈ కంచె.
ఈ సినిమాను ఈనెల 22న దసరా కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ సంధర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు. ఇందులో భాగంగా ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న హీరోయిన్ ప్రగ్యా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
ప్రగ్యా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... ఓసారి గోదావరి జిల్లాలోని తాటిపాక అనే గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. అక్కడికి చాలా మంది జనాలు వచ్చారు. అక్కడ నేను వరుణ్ చెంప చెల్లుమనిపించే సీన్ చేయాలి. కానీ అక్కడున్న ఫ్యాన్స్ అంతా కూడా తెలుగులో వరుణ్ ను కొట్టవద్దు అంటూ అరుస్తున్నారు. అయితే వాళ్లు తెలుగులో అరవడంతో ముందుగా నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత వరుణ్ నాకు అర్థమయ్యేట్లుగా చెప్పాక.. ఆ సీన్ చేయడానికి చాలా భయమేసింది. ఆ అభిమానులంతా అలా అరుస్తుంటే నిజంగా వాళ్లు నాకు వార్నింగ్ ఇచ్చినట్లుగా అనిపించింది అంటూ ప్రగ్య చెప్పుకొచ్చింది.
అలాగే వరుణ్ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడని తెలుసు కానీ, మెగాఫ్యామిలీ నుంచి వచ్చాడని మొదట్లో తనకు తెలియదని.. ఆ తర్వాత తనకు తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపింది. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఎంతో సింపుల్ గా, అందరితో కలిసిమెలిసి వుంటాడని వరుణ్ పై ప్రగ్యా ప్రశంసలు కురిపించింది.
ఇటీవలే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికేట్ ను కూడా దక్కించుకుంది. నిజమైన వరల్డ్ వార్ 2 గన్స్ , ట్యాంక్స తో జార్జియా లో భారి వ్యయం తో చిత్రీకరించిన వార్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది.
.ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.
(And get your daily news straight to your inbox)
Jun 01 | బ్రహ్మాస్త్ర ఫిల్మ్‌కు చెందిన కొత్త అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ ఫిల్మ్‌కు చెందిన కొత్త టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌తో పాటు ఇతర స్టార్స్ ఉన్న ఆ... Read more
Jun 01 | బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. కేకే పాటలకు స్టెప్పులేసిన అభిమానులు.. ఆ... Read more
May 30 | కరోనా లాక్ డౌన్ లో వాయిద పడ్డ సినిమాలన్ని వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. గతేడాది పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ధైర్యాన్ని ఇచ్చాయి. అదే క్రమంలో... Read more
May 30 | ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకన్న మంగళూరు బ్యూటీ కృతిశెట్టి తన కెరీర్ లోనూ విజయాల పరంపరను సోంతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి... Read more
May 30 | యాక్టింగ్‌లోనే కాదు సినిమా ప్రమోషన్లలోనూ తన దారి సపరేటు అని నిరూపించారు ప్రముఖ నటుడు, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు. తాను నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యానని చెప్పిన మహేశ్ బాబు.. త్వరలో విడుదల కానున్న... Read more