Madras HC notice to Rajinikanth

Madras hc notice to rajinikanth

Madras HC issues notice to Rajinikanth, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth latest news, Rajinikanth court news, Rajinikanth issue, Rajinikanth HC news, Rajinikanth latest updates, Rajinikanth

Madras HC notice to Rajinikanth: Madras HC issues notice to Tamil superstar Rajinikanth on petition by... The Madras High Court today ordered issue of notice to Tamil superstar Rajinikanth on a plea by a financier seeking to initiate action against.

ధనుష్ తండ్రి వల్ల రజనీకి కోర్టు నోటీసులు

Posted: 06/23/2015 09:50 AM IST
Madras hc notice to rajinikanth

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవలే ‘లింగ’ సినిమా సమస్య ఇంకా వెంటాడుతూనే వుంది. ఇది కాకుండా తాజాగా రజనీకాంత్ కు మరో కొత్త సమస్య వచ్చిపడింది. రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

రజనీకాంత్ వియ్యంకుడు, ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ తండ్రి అయినటువంటి కస్తూరి రాజా 2012లో ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమా నిర్మాణం కోసం ముకుంద్ బోత్రా అనే ఫైనాన్సియర్ దగ్గర రుణం తీసుకున్నారట. అయితే ఈ విషయంపై ముకుంద్ బోత్రా ఫిర్యాదు ఇలా వుంది.

ముకుందా బోత్రా వేసిన కేసులోని వివరాలేంటంటే.... కస్తూరి రాజా 2012లో ‘మై హూ రజనీకాంత్’ అనే హిందీ సినిమా నిర్మాణం కోసం తన వద్ద 40 లక్షలు రుణం తీసుకున్నారని, ఆ తర్వాత మరో 25 లక్షలు రుణం అడిగారని... పైగా ఆ డబ్బులు తాను చెల్లించకపోతే తన కొడుకు మామ అయినటువంటి రజనీకాంత్ చెల్లిస్తారని తనకు హామీ ఇచ్చారని ముకుంద్ బోత్రా కేసులో తెలియజేసారు.

అయితే కస్తూరి రాజా ఇచ్చిన చెక్కులు చెల్లలేదని ముకుంద్ బోత్రా ఫిర్యాదు చేసారు. దీంతో ముకుంద్ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు విచారణ కోసం జడ్జి.. రజనీకాంత్ మరియు కస్తూరి రాజా న్యాయవాదులకు నోటీసులు జారీచేసారు. మరి ఈ విషయంపై రజనీకాంత్, కస్తూరి రాజాలతో పాటుగా ధనుష్ కూడా ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  HC  Notice  Kasturi Raja  Dhanush  

Other Articles