Gopichand | Nayanthara | B Gopal

Gopichand nayanthara movie shooting updates

Gopichand Nayanthara movie shooting started, Gopichand Nayanthara movie, Gopichand Nayanthara movie started, Gopichand Nayanthara news, Gopichand movie news, Gopichand movie updates, Gopichand movie stills, Gopichand hot news, Gopichand stills, Gopichand

Gopichand Nayanthara movie shooting updates: Hero gopichand latest upcoming movie with Director B.gopal. nayanthara heroine. T. Ramesh producer.

కోకాపేటలో గోపిచంద్ నయనతారల యాక్షన్

Posted: 05/08/2015 10:32 AM IST
Gopichand nayanthara movie shooting updates

‘లౌక్యం’, ‘జిల్’ వంటి వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న గోపిచంద్ మరోసారి హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ కొత్తగా మొదలుపెట్టేసాడు. ‘జిల్’ సినిమా తర్వాత గోపిచంద్ హీరోగా ప్రముఖ మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు.

నిజానికి ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమై మళ్లీ ఆగిపోయింది. ఎన్నో అవంతరాలను ఎదుర్కొని మళ్లీ తాజాగా ప్రారంభమయ్యింది. గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.రమేష్ నిర్మిస్తున్నారు.

కోకాపేట పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా నయనతార కూడా షూటింగ్ లో పాల్గొన్నట్లుగా తెలిసింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు ‘అనామిక’ తర్వాత నయనతార నటిస్తున్న తెలుగు చిత్రం ఇదే కానుంది. ఈ చిత్రాన్ని ఆగష్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  Nayanthara  B Gopal  

Other Articles