Tamil film producers against to lingaa distributors strike

Tamil film producers against to Lingaa distributors strike, Tamil film producers condemn Lingaa distributors strike, Tamil film producers condemn, Tamil film producers against Lingaa distributors strike, Lingaa distributors strike, Lingaa movie distributors strike, Lingaa movie latest news, Lingaa movie

Tamil film producers against to Lingaa distributors strike: Tamil film producers condemn the distributor's strike against Rajinikanth over 'Lingaa' losses.

రజినీ పరువు పోతుందంటున్న తమిళ నిర్మాతలు

Posted: 02/20/2015 12:17 PM IST
Tamil film producers against to lingaa distributors strike

రజనీకాంత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘లింగ’ సినిమా ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్ర అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోగా... అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా రోడ్డున పడాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని, ఈ సినిమా కొనుగోలు చేసి భారీగా నష్టపోయామని, అందుకుగాను తమకు నష్టపరిహారాన్ని అందించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరారు.

డిస్ట్రిబ్యూటర్లు 50% నష్టపోగా... నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాత్రం కేవలం 10% మాత్రమే చెల్లిస్తానని చెప్పడంతో... ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా... ‘లింగ’ సినిమా ప్రదర్శించిన, ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భిక్షాటన చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాన్ని తమిళ చిత్ర నిర్మాతల మండలి వ్యతిరేకించింది.

ఇలా అడుక్కోవడం వలన రజనీకాంత్ పరువును దిగజార్చడం అవుతుందని తమిళ చిత్ర నిర్మాతల మండలి మండిపడింది. వీరి మాటలపై డిస్ట్రిబ్యూటర్లు స్పందించారు. తమిళ చిత్ర నిర్మాతల మండలిలో రాక్ లైన్ వెంకటేష్ సభ్యుడు కాదు. అలాంటిది అతనికి మీరెందుకు మద్ధతునిస్తున్నారు. ‘లింగ’ వివాదంలో రాజకీయ పార్టీల జోక్యం అనివార్యంమని డిస్ట్రిబ్యూటర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మరి ఈ విషయంపై చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, డిస్ట్రిబ్యూటర్లు, తమిళ చిత్ర నిర్మాత మండలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lingaa  distributors  strike  against  Tamil producers  condemn  tamil news  

Other Articles