Nithin cuts hand for pawan kalyan

Nithin, Nithin fan of Pawan Kalyan, Nithin on Pawan Kalyan, Nithin cuts hand, Nithin cuts hand for pawan kalyan, Pawan Kalyan on Nithin, Gopala Gopala mvoie, Gopala Gopala collections, Gopala Gopala updates, Gopala Gopala movie wallpapers, Nithin next movie, Pawan Kalyan next movie updates

Nithin cuts hand for Pawan Kalyan : tollywood shocked by hero Nithin craze about Pawan Kalyan. Nithin cuts his hand and also gives harati when Pawan Kalyan comes in Gopala Gopala movie. Gopala Gopala movie going with good collections and positive talk

పవన్ పై భక్తి చాటిన నితిన్

Posted: 01/14/2015 08:38 AM IST
Nithin cuts hand for pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే భక్తులే చాలామంది ఉన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది పవనిజం ఫ్యాన్సే. ఇండస్ట్రీలో కూడా పవర్ స్టార్ కు వీరాభిమానులు లెక్కలేనంతమంది ఉన్నారు. వీరిలో యంగ్ హీరో నితిన్ కూడా ఒకరు. పవన్ ను చూసి సినిమాల్లోకి రావాలని ఇన్ స్పైర్ అయి హీరో అయిన నితిన్ ఇప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్ అని గర్వంగా చెప్పుకుంటాడు. పవన్ ను గుండెల్లో పెట్టుకుంటా అని ఈ మద్య సభా వేదికపై కూడా చెప్పాడు.

అయితే ఈ వీరాభిమానంపై కొందరు విమర్శలు చేశారు. ఇదంతా కేవలం పవన్ క్రేజ్ ను కలెక్షన్ గా క్యాష్ చేసుకునేందుకే అని ఆరోపించారు. కాని తాజాగా నితిన్ చేసిన పనితో అందరికి సమాధానం చెప్పాడు. పవన్ పై తనకు ఉన్న అభిమానం, భక్తి ఎలాంటిదో నిరూపించాడు. లేటెస్ట్ మూవీ ‘గోపాల గోపాల’ ప్రీమియర్ షోకు వెళ్లిన లవర్ బాయ్..., సినిమాలో పవన్ కళ్యాణ్ రాగానే ఆనందం ఆపుకోలేకపోయాడు. కృష్ణుడిగా నటిస్తున్న హీరోను చూసిన ఈ హీరో పూనకం వచ్చినట్లుగా పరవశించాడు. చేయి కోసుకుని అభిమాన హీరోకు వీర తిలకం దిద్దాడు. అంతేకాకుండా హారతి ఇచ్చి భక్తి చాటుకున్నాడు.

నితిన్ చేసిన పనితో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. పవన్ పై మరీ ఇంత భక్తి ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా నితిన్ భక్తి చూసి అవాక్కవుతుంది. స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి మరో హీరోపై ఈ స్థాయిలో అభిమానం చూపించటం ఏమిటా అని అంతా చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Pawan Kalyan  Gopala Gopala  

Other Articles