Shahrukh khan attends salman khan sister arpita sangeet ceremony hyderabad falaknuma palace

shahrukh khan, shahrukh khan latest news, shahrukh khan salman khan, shahrukh khan arpita sangeet, shahrukh khan salman khan hug, shahrukh khan attends arpita sangeet, hyderabad falaknuma palace, shahrukh khan wikipedia, shahrukh khan news, shahrukh khan family members, salman khan news, salman khan latest news, salman khan sister arpita khan, arpita khan marriage, arpital ayush marriage, arpital sangeet ceremony

shahrukh khan attends salman khan sister arpita sangeet ceremony hyderabad falaknuma palace

షారుఖ్-సల్మాన్ లను కలిపిన సోదరి అర్పిత...

Posted: 11/17/2014 06:03 PM IST
Shahrukh khan attends salman khan sister arpita sangeet ceremony hyderabad falaknuma palace

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కండలవీరుడు సల్మాన్ ఖాన్ ల మధ్య గతకొన్నాళ్ల నుంచి కాస్త స్నేహబంధమే వుందికానీ... వ్యక్తిగతంగా ఇద్దరూ కలుసుకుని మాట్లాడిన సందర్భాలైతే అస్సలు లేవు! గతంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలొచ్చి దాదాపు ఐదేళ్లవరకు మాట్లాడుకోవడం కాదుకదా.. కనీసం ఒకర్నొకరు చూసుకోవడానిక్కూడా అసహ్యించుకునేవారు. ఒకరిపై మరొకరు ఏదో ఒక కామెంట్ సంచలన కామెంట్లు చేసుకోవడం, మరింతగా రగిలిపోవడం లాంటివి సందర్భాలే నడిచాయి. అయితే ఆమధ్య జరిగిన ఓ ఫంక్షన్ లో వీరిద్దరూ కౌగిలించుకుని అభిమానులను ఆనందపరించారు. అప్పట్లో ఆ సన్నివేశం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. ‘‘విడిపోయిన స్నేహితులు మళ్లీ కలిశారంటూ’’ ఒకటే వార్తలు. అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ఓ విందు కార్యక్రమంలో వీళ్లిద్దరూ కలుసుకున్న సందర్భాలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గానే నిలిచాయి. అయితే అవి కేవలం ఫంక్షన్ల నేపథ్యంలో కలుసుకున్నారు కానీ.. వ్యక్తిగతంగా కాదు! దీంతో వీళ్లిద్దరూ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని బాలీవుడ్ జనాలు ఎప్పటినుంచి వేచి చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వాళ్ల నిరీక్షణ ఇక్కడితో పూర్తయినట్లు కనిపిస్తోంది. ఈ ఇద్దరు బడా హీరోలకు అర్పిత ఖాన్ కలిపి.. సందడి వాతావరణాన్ని నెలకొల్పింది. సల్మాన్ ఖాన్ సొదరి అర్పిత వివాహ వేడుకలు హైదరాబాదులో జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా సల్మాన్ ఖాన్ పెళ్లికి నాలుగురోజుల ముందుగానే ఫలక్ నుమా ప్యాలెస్ ను రెండుకోట్లతో బుక్ చేసుకున్నాడు. బాలీవుడ్ లో వున్న ప్రముఖులందర్నీ ఆహ్వానించాడు. అయితే అతను షారుఖ్ కు ఆహ్వానం పంపాడా..? లేదా..? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ విషయమై షారుఖ్ ను ప్రశ్నిస్తే.. ‘‘నాకు ఆహ్వానం పంపాల్సిన అవసరం లేదు. అర్పిత నాకు చిన్నప్పటినుంచే తెలుసు. వాళ్లు నన్ను పిలవకపోయిన నేను అర్పిత పెళ్లికి ఖచ్చితంగా హాజరవుతాను. వారికి శుభాకాంక్షలు తెలుపుతాను. అర్పిత నాకు సోదరిలాంటిది’’ అని పేర్కొన్నాడు. అతను చెప్పినట్లుగానే ఆదివారం హైదరాబాదులో జరిగిన సంగీత్ కార్యక్రమానికి షారుఖ్ హాజరయి అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాడు. వీళ్లిద్దరి కలయికను చూసి బాలీవుడ్ అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో షారుక్ పాల్గొనడంతో సల్మాన్ ఖాన్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ముగిసినట్లేనని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles