Pranitha not acting beside balakrishna for his next movie

balakrishna, balakrishna latest movies, nandamuri fans, nandamuri family, sathyadeva's movie, latest movies, telugu film news, tollywood news, latest updates, pranitha, attarintiki daredi, pranitha images, trisha, trisha movies, trisha hot photoshoot, heroines hot images

pranitha not selected for balakrishna's upocming movie : trisha will be lead with balakrishna's latest movie pranitha not selected

బాలయ్యతో చేయట్లేదని చెప్పేసింది

Posted: 08/24/2014 05:48 PM IST
Pranitha not acting beside balakrishna for his next movie

బాలకృష్ణతో ప్రణీత సినిమా చేస్తున్నట్లు ఫిలింనగర్లో తెగ వార్తలు వచ్చాయి. వీటిపై నటి ప్రణీత వివరణ ఇచ్చింది. తాను బాలయ్య సినిమాలో చేయట్లేదని చెప్పేసింది. సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలే అని కొట్టిపారేసింది. తన కొత్త ప్రాజెక్టులు, సినిమాల గురించి తానే మీడియాకు ప్రకటిస్తానని చెప్తోంది. అలాకాకుండా వచ్చే రూమర్లను అభిమానులు నమ్మవద్దని స్పష్టం చేసింది. సత్యదేవ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒక హీరోయిన్ గా త్రిష ఎంపిక కాగా.., రెండవ హీరోయిన్ గా ప్రణీతను సెలక్ట్ చేసి కధ విన్పించినట్లు వార్తలు వచ్చాయి.

పూర్తి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన ఈ సినిమా ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా పేరును ప్రకటించే అవకాశం ఉంది. తాను బాలకృష్ణతో చేయటం లేదని ప్రణిత చెప్పటంతో నందమూరి అభిమనులతో పాటు, ప్రణిత ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. బాలయ్య సరసన చూస్తామనుకున్న కల నెరవేరటం లేదని బాదపడుతున్నారు. బావ, అత్తారింటికి దారేది సినిమాలతో అబిమానులకు చేరువయిన ప్రణిత ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో నటిస్తోంది.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranitha  balakrishna  latest news  tollywood  

Other Articles