Vishnu next movie is a multi starrer

manchu vishnu, manchu manoj, manchu laxmi, mohan babu, mohanbabu family movies, tollywood, latest movies, actors, telugu news, latest news, multi starrer movies

actor vishnu next movie is huge multi starrer with 24 frames factory banner : vishnu plans to do a multi starrer movie

త్వరలోనే అందరికి సర్ ప్రైజ్ ఇస్తా !!

Posted: 08/24/2014 01:53 PM IST
Vishnu next movie is a multi starrer

అభిమానులకు త్వరలోనే సర్ ప్రైజ్ ఇచ్చేందుకు మంచు విష్ణు సిద్ధమవుతున్నాడు. కేవలం మంచు అభిమానులకే కాదు.., టాలీవుడ్ అభిమానులందరికీ ఈ సర్ ఫ్రైజ్ అంటున్నాడు. ఇంతకీ ఏంటా సర్ ఫ్రైజ్ అనుకుంటున్నారా. త్వరలోనే మంచు విష్ణు సొంత బ్యానర్లో పెద్ద హీరోలతో సినిమాలు చేసే పనిలో ఉన్నాడు. కలెక్షన్ కింగ కుమారుడుగా ఇండస్ర్టీకి వచ్చిన విష్ణు హీరోగా అలరించాడు. అదే సమయంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీని స్థాపించి నిర్మాతగా సినిమాలు కూడా తీస్తున్నాడు. ఒకే సమయంలో రెండు బాద్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ.., నిలదొక్కుకుంటున్నాడు.

అయితే 24 ఫ్రేం ఫ్యాక్టరీలో కేవలం సొంత కుటుంబ సినిమాలు మాత్రమే వచ్చాయి. త్వరలోనే ఈ ఫ్యాక్టరీలో ఇతర నటుల సినిమాలు కూడా బయటకు వస్తాయని విష్ణు చెప్తున్నాడు. తన బ్యానర్లో టాలీవుడ్ పెద్ద హీరోలతో సినిమా చేస్తున్నట్లు విష్ణు చెప్పాడు. అయితే ఎవరా హీరోలు.., ఏ సినిమా అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే తన బ్యానర్ పెద్ద హీరోలతో సినిమా చేసి సర్ ప్రైజ్ ఇస్తుందని విష్ణు అన్నాడు. ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా వస్తున్న ‘కరెంట్ తీగ ’ సినిమాలో విష్ణు నటిస్తున్నాడు. ఇది కాకుండా విష్ణు హీరోగా నటించిన ‘అనుక్షణం’ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా పూర్తయింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తనకు నటుడిగా మంచి గుర్తింపు తెస్తుందని చెప్తున్నాడు. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  multi starrer movies  tollywood  latest news  

Other Articles