Hero siddharth finally revealed about his marriage life

hero siddharth, siddharth latest news, siddharth press meet, siddharth marriage life, siddharth samantha, siddharth news, siddharth jigarthanda movie, siddharth comments samantha, siddharth twitter

hero siddharth finally revealed about his marriage life : south film industry lover boy finally revealed his marriage life. He said that he will do marriage in next four months but didn't tell to whom

ఎట్టకేలకు సిద్ధార్త్ పెళ్లి విషయాన్ని బయటపెట్టేశాడు!

Posted: 08/25/2014 11:46 AM IST
Hero siddharth finally revealed about his marriage life

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకవైపు ఫ్యామిలీ చిత్రాలలో మరోవైపు లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన సిద్ధార్థ్.. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ తెలుగు సినిమాల్లో రావడం మానేశాడు. తమిళంలో అరకొర సినిమాల్లో నటించినప్పటికీ అవి విజయం సాధించలేకపోయాయి. దీంతో కొన్నాళ్లపాటు అతను ఖాళీగానే సమయాన్ని గడిపాడు. అయితే ఆ నేపథ్యంలోనే సిద్ధార్త్, సమంతతో కలిసి ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అందుకు సాక్ష్యాలుగా వీరిద్దరు కలిసి గుళ్లకు దర్శనం చేసుకోవడం, పార్టీలు - ఫంక్షన్లకు వెళ్లడం వంటి తదితర ఫోటోలు కూడా హల్ చల్ చేశాయి. దీంతో వీరిద్దరూ పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారని అందరూ ఊహించేసుకున్నారు. అయితే సమంత ఇటువంటి పుకార్లకు అప్పుడప్పుడు ఫుల్ స్టాప్ పెడుతున్నప్పటికీ సిద్ధార్త్ మాత్రం ఇంతవరకు ఆ రూమర్స్ మీద పెదవి విప్పలేదు. కానీ ఇన్నాళ్ల తర్వాత సిద్ధార్త్ తన పెళ్లి విషయం గురించి బయటపెట్టేశాడు.

ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ గురించి మీడియాతో పంచుకోని సిద్దూ.. ఇటీవల తన తమిళ్ మూవీ ‘‘జిగార్తండ’’ (తెలుగులో చిక్కడు దొరకడు) మంచి విజయం సాధించిన సంతోషంతో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేశాడు. సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు చెబుతూ... తాను మరో నాలుగునెలల్లోనే పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి అందరికీ షాక్ కి గురి చేశాడు. ఈ సంవత్సరం చివర డిసెంబర్ లో కానీ.. వచ్చే ఏడాదిలోగానీ తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా అతను పేర్కొన్నాడు. అయితే.. తాను ఎవరితో పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇదంతా సస్పెన్స్ అంటూ చెబుతూనే.. ఒక సెటైరిక్ ఎక్స్ ప్రెషన్ కూడా అతను ఇచ్చాడని చెన్నై మీడియా వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో అతను చెప్పింది నిజమా..? లేక ఎప్పటిలానే వెటకారంగా చెప్పాడా..? అని ఆందోళనల్లో అందరూ మునిగిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : siddhartha  samantha  twitter news  siddharth marriage life  jigarthanda  

Other Articles