Priyamani secret boyfriend has revealved

priyamani secret boyfriend has revealved, priyamani latest news, priyamani secret boyfriend, priyamani latest news on her boyfriend, priyamani boyfriend govind, sandalwood actor govind latest news, sandalwood actor govind with priyamani, priyamani with sandalwood actor priyamani

priyamani secret boyfriend has revealved

ప్రియమణి రహస్య ప్రేమికుడు దొరికిపోయాడు!

Posted: 07/01/2014 11:11 AM IST
Priyamani secret boyfriend has revealved

(Image source from: priyamani secret boyfriend has revealved)

గతంలో టాలీవుడ్ ని తన అందచందాలతో ఓ ఊపు ఊపిన మూడుపదుల భామ ప్రియమణి... ఆ తరువాత సినిమాలలో అవకాశాలు రాకపోవడం వల్ల కొన్నాళ్లపాటు కనుమరుగయింది. మధ్యమధ్యలో కోలీవుడ్, మాలీవుడ్ లలో చిన్నచిన్న సినిమాలు, ఐటం సాంగ్స్ చేసుకుంటూ కాలం గడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒకరితో ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు షికార్లు చేశాయి.

వీటిపై స్పందించిన ప్రియమణి కూడా తనకు బాయ్ ఫ్రెండ్ నిజంగానే వున్నాడనే రీతిలో వ్యవహరించింది. దీంతో ఇతని ప్రేమికుడు గురించి ఆరా తీయాలని మీడియావాళ్లు ఎంత ప్రయత్నించినప్పటికీ... ప్రియమణి వాటిని బయటపెట్టకుండా చాలా జాగ్రత్తలే పాటించింది. ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించిన విషయాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన విశేషాలు బయటపడ్డాయని తాజా వార్తల సమాచారం!

‘‘నాకు ఒక ప్రేమికుడు వున్నాడు... అతని వివరాలు త్వరలోనే బయటపెడతా’’నంటూ అందరి హీరోయిన్లలాగే ప్రియమణి కూడా తన ప్రియుడు గురించి విషయాలు పెట్టకుండా అందరినీ సస్పెన్స్ లో ముంచెత్తింది. ఈమె ప్రేమికుడు విషయాల గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ లలో వుండే మీడియాలు రకరకాల వార్తకథనాలను కూడా ప్రసారం చేశాయి.

ఈ వార్తకథనాలపై స్పందిస్తూ ఇటీవల శాండిల్ వుడ్ నటుడు అయిన గోవింద్... ప్రియమణితో తాను సన్నిహితంగా వున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి కలకలం సృష్టించాడు. అంతేకాదు... ప్రియమణితో తాను దిగిన ఫోటోలు ఎంతో విలువైవని... ఈమెతో గడిపిన కాలం మరువలేనిదని... ఈమెతో ఇలా కలిసి ఫోటోలు దిగడం ఎంతో సంతోషంగా వుందంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశాడు.

దీంతో ప్రియమణి రహస్య ప్రేమికుడు ఇతడేనని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రియమణి ఇన్నాళ్లు దాచి పెట్టిన తన ప్రేమికుడు విషయాలు బయటపడ్డాయని రకరకాల వార్తకథనాలను ప్రచురించింది. అయితే దీనిపై ఇంకా ప్రియమణి ఎటువంటి అభిప్రాయాలను బయటపెట్టలేదు. ప్రియమణి ఇతడినే పెళ్లి చేసుకుంటుందా... లేకపోతే అందరి హీరోయిన్స్ లాగా ఈమె కూడా ‘‘గోవింద్ కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమే’’నని సింపుల్ గా కథను ముగించేస్తుందా..? అని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు. వెయిట్ అండ్ సీ!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles