Cherry in no more mega powerstar

Cherry in no more Mega Powerstar , Ramcharan remove Mega Power Star, Ramcharan no Mega Power Star, Ramcharan not use the Power Star

Cherry in no more Mega Powerstar , Ramcharan remove Mega Power Star, Ramcharan no Mega Power Star, Ramcharan not use the Power Star

చరణ్ ‘పవర్ ’ కట్ చేసుకున్నాడు

Posted: 04/22/2014 05:52 PM IST
Cherry in no more mega powerstar

సినిమా నటులకు వారి నటనను బట్టి, వారికున్న క్రేజ్ ని బట్టి సినీ జనాలు, వారి అభిమానులు వారి పేర్లకు ముందు  బిరుదులు పెట్టి ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరోకు ఓ బిరుదు ఉంది. ఏ హీరో అభిమానులు వారిని దాంతో సంబోధిస్తుంటారు.

కానీ మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తనయుడుకి మాత్రం తండ్రి, బాబాయిల బిరుదులు కలిపి పెట్టేసి ‘మెగా పవర్ ’ స్టార్ అని పిలుచుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ ఇప్పుడు ‘పవర్ ’ కట్ చేయించుకున్నాడు. దానికి కారణం తన బాబాయి పవన్ కళ్యాణ్ బిరుదు అవ్వడమే. గత కొంత కాలంగా మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న పవన్, చిరుకి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి,  మిగతా పార్టీలకు మద్దతు ఇస్తున్నాడు.

దీంతో తన తండ్రికే వ్యతిరేకంగా ఉన్న పవన్ బిరుదు అయిన ‘పవర్ ’ ని కట్ చేసుకొని రామ్ చరణ్ గా పిలవాలని ఆయన తన అభిమానులకు సూచించారు. ఇక పై తన పేరుకు ముందు ఎక్కడ ‘వపర్ ’ అని రాయకూడదని, పవన్ కళ్యాణ్ బిరుదు తన బిరుదులో ఎందుకు వుండాలని రామ్‌చరణ్ భావించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని, ఇక ఏ సందర్భంలోనూ తనను ఆ పేరుతో పిలవటాన్ని తాను ఇష్టపడనని రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి స్పష్టం చేసినట్టు సమాచారం.

అలాగే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతూ సెట్స్ మీద వున్న ‘గోవిందుడు అందరివాడేలే ’ సినిమా టైటిల్స్ లోగానీ, పబ్లిసిటీలోగానీ ‘ మెగా పవర్ స్టార్ ’ అనే అక్షరాలు కనిపించకూడదని నిర్మాతకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కొంత మంది మాత్రం పేరుకు ముందు ‘పవర్ ’ ఉంటేనే బాగుంటుందని సూచిస్తున్నారు.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles